'పెద్ది' దుబాయ్ ప్రివ్యూ షో టాక్: క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే..!

మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ తెలుగు ప్రేక్షుకుడు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'పెద్ది'.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పెద్ది ట్రైలర్ కేవలం యూట్యూబ్ లోనే కాకుండా ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి. తాజాగా రిలీజ్ అయిన ఐటెమ్ సాంగ్ హెల్లల్లెల్లో యువతను ఊపేస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా సమ్మర్ లో మాత్రం ఒక్క పెద్ద సినిమా కూడా రాకపోవడంతో అటు సినీ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సమయంలోనే పెద్ది సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇక పెద్ది చిత్రానికి సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ జారీ చేశారు. కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు చెప్పారు. అయితే సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 3 గంటల 9 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. అయితే పెద్ది సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు దుబాయ్ లో కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వస్తున్న టాక్ ను చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Peddi Dubai Preview Show Talk The Shocking Climax Twist That Everyone Buzzing Peddi movie review

పెద్ది ఫస్టాఫ్ కొద్దిగా స్లో ఉన్నా.. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా వేరే లెవెల్ కు వెళ్తుందని.. ఫస్టాఫ్ లో ముఖ్యంగా రామ్ చరణ్, జగపతిబాబు నటనను ప్రేక్షకులు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్ ఆడియెన్స్ ను కంటతడి పెట్టించేలా ఉంటుందని ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్ ఈ మధ్య కాలంలో రాలేదని తెలుస్తోంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి కథను ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలని దుబాయ్ నుంచి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 45 నిమిషాలు, ఆ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం అని సమాచారం. పెద్ది సినిమాకు సంబంధించిన ఫుల్ రివ్యూ కావాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+