అమరన్ మూవీ థియేటర్‌పై పెట్రోల్ బాంబ్‌తో దాడి..
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఇటీవలే రీలీజయి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, తాజాగా అమరన్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ బాంబ్ విసిరాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన చిత్రం అమరన్. ఈ సినిమా దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కింది. అయితే, ఈ మూవీపై గతకొన్నిరోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో అమరన్ మూవీ ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్లో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ బాంబుతో దాడి చేశాడు. రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా మేళప్పళయం ప్రాంతంలోని అలంకార్ థియేటర్‌పై నేడు (నవంబర్ 16) తెల్లవారుజామున ఓ వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు. అయితే, అదృష్టవశాత్తూ అక్కడెవ్వరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ సంఘటనపై ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు..
అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా విడుదలయిన అమరన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లు నెట్‌తోపాటు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం మూడో వారం కూడా ఎంతో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో దూసుకెళ్లిపోతుంది. 2014లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముకుంద్ వరదరాజన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన జీవిత ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక, ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్ శివకార్తికేయన్, అతడి భార్య ఇందు పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.












Click it and Unblock the Notifications