'కల్కి' కోసం ప్రభాస్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

యంగ్ రెబల్‌స్టార్, డార్లింగ్ ప్రభాస్‌ 'కల్కి' సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు.. చూసినవారంతా నాగ్ దర్శకత్వ ప్రతిభకు ఫిదా అవుతున్నారు. నటీనటుల నటన.. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటన అందరికీ నచ్చింది. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న 'కల్కి' విడుదల తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తూ దూసుకువెళుతోంది.

దేశంలో నెంబర్ వన్ హీరోగా
సినిమా సినిమాకు ప్రభాస్ పారితోషికం పెరుగుతూ వస్తోంది. బాహుబలి సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పరాజయం పొందినప్పటికీ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. బాహుబలి సినిమాకు కేవలం రూ.25 కోట్ల పారితోషికం తీసుకోగా ఫ్లాపైన ఆ మూడు సినిమాలకు దాదాపు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు అందుకున్నాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ ఒక్కడినే టాప్ హీరోగా ఏకగ్రీవంగా అందరూ ఆమోదించడంతో వీటి తర్వాత వచ్చిన సలార్ సినిమాకు రూ.120 కోట్లు అందుకున్నాడు.

prabhas kalki 2898 ad take remuneration details here

కల్కికి, ఈశ్వర్ కు రెమ్యునరేషన్ లో తేడా ఇదే
కల్కి సినిమాకు రూ.150 కోట్లు తీసుకున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాలు దాదాపుగా రూ.1450 కోట్ల వ్యాపారం చేసి సంచలన రికార్డు నమోదు చేశాయి. పారితోషికంతోపాటు కొన్నిసార్లు లాభాల్లో వాటా కూడా డార్లింగ్ తీసుకుంటున్నాడు. కల్కి తర్వాత రాజాసాబ్, సందీప్ రెడ్డి చిత్రం, మారుతితో చేస్తున్న రాజాసాబ్, సలార్-2 చిత్రాలకు భారీస్థాయిలో వ్యాపారం జరగబోతోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తొలి చిత్రం ఈశ్వర్ కు కేవలం రూ.4 లక్షల పారితోషిం తీసుకున్న డార్లింగ్ 22 సంవత్సరాల వ్యవధిలోనే సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదగడం అద్బుతమని సినీ ప్రియులంతా కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+