స్పిరిట్' లో ప్రభాస్ బ్రదర్ ఎవరో తెలిసిపోయింది..? బాక్సాఫీస్ ఊచకోతే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5 న రిలీజ్ కానున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అది నిజమా..? కాదా..? అనే దానితో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అదేంటంటే..? స్పిరిట్ మూవీలో ప్రభాస్ బ్రదర్ గా చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నటిస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగాను చూస్తే బయట చాలా రగ్గడ్ లుక్ తో గంభీరంగా ఉంటారు. ఆయన మాటతీరు కూడా చాలా గంభీరంగా బేస్ వాయిస్ తో ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ సినిమాలో చిన్న నెగటివ్ క్యారెక్టర్ చేసినా చాలు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని సినిమా ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అలాగే సందీప్ దర్శకుడే కాదు మంచి నటుడని ఆయనతో వర్క్ చేసిన చాలామంది చెబుతుంటారు. ఒకవేళ ఆయన స్పిరిట్ మూవీలో నటిస్తే ప్రేక్షకుల్ని ఫిదా చేయడంలో మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతారని పలువురు విశ్లేషిస్తున్నారు.

స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మునుపెన్నడూ చేయని పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తోపాటు టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పిరిట్ మూవీని టీ సిరీస్, భద్రకాళీ, బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా 8 భాషల్లో అంటే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మాండరిన్ (చైనీస్), జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications