'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదే..? ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'ది రాజాసాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్- రొమాంటిక్ కామెడీ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 170 కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇక లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ తో మొత్తం రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే మూవీ ఫ్లాప్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. మొత్తానికి రాజాసాబ్ మూవీ అటు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఇటు మూవీ లవర్స్ ను కాస్త డిజపాయింట్ చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు అద్దిరిపోయే అప్డేట్ అందుతోంది.
'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 3 న సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఫౌజీ చిత్రంపై గతంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సీఈఓ చెర్రీ కీలక విషయాలను వెల్లడించారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని అన్నారు. ప్రభాస్ పై చిత్రీకరించాల్సిన మూడు ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లు మినహా మిగతా చిత్రీకరణ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. ఫౌజీ మూవీ అక్టోబర్ లోనే రిలీజ్

ఇక ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మార్చి 5, 2027 లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. అయితే స్పిరిట్ కంటే ముందే ఫౌజీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫౌజీ మూవీలో ప్రభాస్ సరసన నటి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ప్రభాస్ కల్కి 2, సలార్ 2 చిత్రాలను చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications