బిగ్ బ్రేకింగ్: గోపీచంద్ సినిమాలో ప్రభాస్
యాక్షన్ హీరో గోపీ చంద్, కావ్య థాపర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వం. విశ్వం, శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ లో ఈ చిత్రం రూపొందింది.
ప్రభాస్ కు సంబంధించిన క్రేజీ న్యూస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వం సినిమా 2024లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.కాగా యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం సినిమాలో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్, అందులోనూ ప్రభాస్ కు సంబంధించిన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

గోపీచంద్ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను ప్రభాస్ తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేస్తారని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తుందని, అక్కడ వాయిస్ ఓవర్ ప్రభాస్ గొంతుతో ప్లాన్ చేశారని తెలుస్తుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో యాక్షన్ హీరో గోపీ చంద్ సినిమా అదిరిపోయేలా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ వాయిస్ ఓవర్ వార్తలతో సినిమాకు హైప్
మరి ఇందులో నిజమెంతో తెలీదు. కానీ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తే ఓ రేంజ్ లో ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గోపీచంద్ ప్రభాస్ మంచి స్నేహితులు కావటంతో గోపీ చంద్ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు. ప్రభాస్ వాయిస్ ఓవర్ నేపధ్యంలో విశ్వం సినిమాకు సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది.
విశ్వం సినిమాపై పెరుగుతున్న అంచనాలు
ఇప్పటికే ప్రేక్షకుల్లో విశ్వంపై ఓ రేంజ్ అంచనా ఉంది. ఇక ప్రభాస్ వాయిస్ ఓవర్ తో అది మరింత పెరిగింది. ఏది ఏమైనా విశ్వం సినిమాకు డార్లింగ్ వాయిస్ ఓవర్ ఇస్తే నిజంగా అదొక అదనపు వాల్యూని సినిమాకు ఇస్తుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications