చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు?
ప్రముఖ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్‌కు సంబంధించిన ప్రైవేట్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'లవ్‌టుడే', 'డ్రాగన్ ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ లీకుల వెనుక ఉన్న అసలు నిజమేమిటనే దానిపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చన జరుగుతోంది.
వైరలవుతున్న ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్స్
గత రాత్రి నుంచి ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై ప్రదీప్ రంగనాథన్ పేరుతో కొన్ని చాట్ స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఓ ప్రముఖ మహిళా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ప్రదీప్ రంగనాథన్ వ్యక్తిగతంగా సంభాషించినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఆ సంభాషణల సారాంశం ప్రకారం.. ప్రదీప్ తరచుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మెసేజ్‌లు పంపిస్తారని.. వారిని పార్టీలకు రావాలని ఆహ్వానిస్తుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ స్క్రీన్ షాట్స్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో, హీరో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇదంతా పబ్లిసిటీ జిమ్మిక్కేనా?
అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇది నిజమైన లీక్ కాదని, ప్రదీప్ తదుపరి చిత్రం 'లిక్' (Love Insurance Kompany - LIK) ప్రమోషన్ల కోసం చిత్ర బృందం ఆడుతున్న డ్రామా అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నేటి కాలంలో సినిమాలపై హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్లు నెగటివ్ పబ్లిసిటీని కూడా ఓ ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటంతో, ప్రేక్షకుల దృష్టిని మళ్లీ సినిమా వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రచార ఎత్తుగడ ఇదంటూ విశ్లేషణలు వస్తున్నాయి.
Is this true? PR?? 😳😳😳 pic.twitter.com/dIJcpobkNt
— Sid 🚀Maxxx (@SidTweep) April 8, 2026
మౌనంగానే ఉన్న హీరో
ఈ వివాదం ఇంతలా ముదురుతున్నా.. హీరో ప్రదీప్ రంగనాథన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా ఇటువంటి లీకులు ఫేక్ అని తెలిసినప్పుడు సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తుంటారు, కానీ ప్రదీప్ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగమైతే.. త్వరలోనే దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ 'లీక్' వ్యవహారం తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.
-
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్.. "రెండో జన్మ" అంటూ !! -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
ఈ పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న పామును చూశారా ? -
500 ఏళ్లనాటి రాతి కుళాయి.. వీడియో వైరల్ ??? -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
పెద్దితో అఖిల్ అక్కినేని డైరెక్ట్ ఫైట్- లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ -
ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కూడా నటించిందని తెలుసా..?












Click it and Unblock the Notifications