వైసీపీకి ఎస్ఈసీ ఊరట..! పెండింగ్ ఎన్నికలపైనా క్లారిటీ..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా.. ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తయితే మరో కీలక ఘట్టం ముగిసినట్లవుతుంది. దీంతో ఎస్ఈసీ తదుపరి ఎన్నికలు, వాటితో పాటు పెండింగ్ లో ఉన్న చర్యలపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఇవాళ ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ లను భద్ర పరిచే విషయంలోనూ కీలక నిర్ణయం ప్రకటించారు.

ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల ఖరారు-ఎస్ఈసీ షెడ్యూల్..!
ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల ఖరారు-ఎస్ఈసీ షెడ్యూల్..!

ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో పరిశీలించిన ఎస్ఈసీ (ap sec) పునేఠా.. కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడి లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డులను 60 రోజుల పాటు భద్రపరుస్తున్నామని తెలిపారు. వివాదాలు ఉన్న చోట మరింత సమయం భద్రపరుస్తామన్నారు. ఇప్పటికే విపక్ష వైసీపీ (YSRCP) ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర రికార్డులు భద్రపరచాలని ఎస్ఈసీకి పలు విజ్ఞప్తులు చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఇదో ఊరటగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఫుటేజ్ ఆధారంగానే వైసీపీ ఎన్నికల పిటిషన్ల దాఖలుకు సిద్దమవుతోంది.

relief to ysrcp as ap sec took key decision on local poll cctv footage pending elections
స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!
స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!

మరోవైపు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలతో పాటు దాదాపు 13 వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మధ్యాహ్నం 4 గంటలలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రంలోగా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+