'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై వస్తున్న విమర్శలు, వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన నిక్కచ్చిగా ఉంటే మనస్తత్వంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ సారి కూడా అలాగే మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న రణవీర్ సింగ్ చిత్రం 'ధురంధర్ 2'పై టాలీవుడ్ స్టార్ కురిపిస్తున్న ప్రశంసలపై ఆయన సెటైర్లు వేశారు. టాలీవుడ్ అగ్రహీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఈ సినిమాను ఆకాశానికెత్తడంపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.

బాధ్యతల భారం.. సౌత్ వరకు చేరిందా?
సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రకాష్ రాజ్.. 'ధురంధర్ 2'ను సపోర్ట్ చేస్తున్న సౌత్ నటులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. "ధురంధర్ 2 సినిమాను అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రశంసించారు.. మరి బాలీవుడ్ నుంచి ఒక్కరైనా స్పందించారా? " అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేస్తూ.. "బాధ్యతల భారం ఇప్పుడు సౌత్ వరకు కూడా పాకినట్లుంది" అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అంటే ఎవరో చెప్పబట్టే మన హీరోలు ఈ సినిమాను పొగుడుతున్నారనే అర్థం వచ్చేలా ఆయన స్పందించడం చర్చనీయాంశమైంది.

Prakash Raj Slams Tollywood Stars Over Dhurandhar 2 Praise Says Responsibility Shifted to South

జస్ట్ ఆస్కింగ్.. అంటూ ప్రకాష్ రాజ్ మరో పోస్ట్!
ప్రకాష్ రాజ్ అంతటితో ఆగకుండా, తన ఇంట్లోని రేడియోలో 'అభి నా జావో చోడ్ కర్..' అనే పాట వస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. "నేను ధురంధర్‌కు చాలా దూరంగా ఉన్నాను.. మీరు కూడానా? #justasking" అని క్యాప్షన్ ఇచ్చారు. సినిమా చుట్టూ ఉన్న పొలిటికల్ ప్రోపగాండాను ఉద్దేశించే ఆయన ఈ కామెంట్లు చేసినట్లు స్పష్టమవుతోంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్: 'ధురంధర్ 2'
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి 'ప్రోపగాండా' అనే ముద్ర పడింది. సినిమాలో 'హిందువులు పిరికివారు' అనే అర్థం వచ్చేలా ఉన్న డైలాగులు, నోట్ల రద్దు చూపించిన విధానంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసినా.. ఖాన్ త్రయం (షారుఖ్, సల్మాన్, అమీర్) సైలెంట్‌గా ఉండటం, కానీ మన తెలుగు హీరోలు మాత్రం పోటాపోటీగా ప్రశంసించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే నటి రమ్య స్పందన, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సినిమాను, దర్శకుడిని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు!
విమర్శలు ఎలా ఉన్నా, 'ధురంధర్ 2' వసూళ్లలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రెండు రోజుల్లోనే ఇండియాలో రూ. 226 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి, వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల మార్కును దాటేసింది. రణవీర్ సింగ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.సినిమా విజయాన్ని ప్రశంసించాలా లేక అందులోని కంటెంట్ ను విమర్శించాలా అనే చర్చ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో రెండు వర్గాలుగా విడిపోయింది. మరి ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్లపై మన టాలీవుడ్ హీరోలు ఎవరైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+