కేరళ స్టోరీ 2 'బీఫ్' వివాదంపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. పోస్టు వైరల్
'ది కేరళ స్టోరీ 2' మూవీపై వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై వివాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 'ది కేరళ స్టోరీ' కు సీక్వెల్ గా ఈ మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మరింత దుమారం రేపింది. ఇందులో ఒక ముస్లిం కుటుంబం ఒక అమ్మాయికి బలవంతంగా బీఫ్ (గో మాంసం) తినిపించినట్లు ఉంది. దాంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ది కేరళ స్టోరీ 2 సినిమాపై సంచలన పోస్టు పెట్టారు.
The real #KeralaStory is how pork, beef and fish coexist with vegetarian sadya and all of them live in harmony. Please relish 😍😍😍 #justasking happy Sunday everyone ❤️❤️ pic.twitter.com/Ea2JCPd6n6
— Prakash Raj (@prakashraaj) February 22, 2026
దేశంలో జరుగుతున్న పరిణామాలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతుంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన పెట్టే పోస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. అవి వైరల్ కూడా అవుతుంటాయి. తాజాగా ది కేరళ స్టోరీ 2 సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం నెలకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ పోస్టు పెట్టారు. ఈ మేరకు పంది మాంసం, బీఫ్, చేపలు, వెజ్ వంటకాలతో కూడిన 'కేరళ సద్యా' ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వంటకాలు అన్నీ సామరస్యంగా ఎలా ఉంటాయో అనేదే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండి.. జస్ట్ ఆస్కింగ్.. అందరికీ హ్యాపీ సండే.. అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఈ మేరకు చిత్ర యూనిట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మరోవైపు బాలీవుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ది కేరళ స్టోరీ 2 మూవీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ది కేరళ స్టోరీ ఒక చెత్త సినిమా.. ఇది ఓ బుల్ ప్రొపగాండా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలా ఎవరు బీఫ్ తినిపిస్తారు..? అలా కనీసం కిచిడీ కూడా తినిపించరు.. అని అనురాగ్ కశ్యప్ విమర్శలు సంధించారు. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ది కేరళ స్టోరీ మూవీపై విమర్శలు గుప్పించారు. సుస్థిరాభివృద్ధి, శాంతిభద్రతల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న కేరళను తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలను సమిష్టిగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఈ మూవీ ఫిబ్రవరి 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!












Click it and Unblock the Notifications