ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !!

హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాని "గ్యాంగ్ లీడర్" సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ చిత్రం పెద్ద విజయం సాధించకపోయినా తన సహజమైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో కనిపించినా, ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో ఆమె కోలీవుడ్‌పై దృష్టి సారించింది.

కాగా తమిళ సినీ పరిశ్రమలో మాత్రం వరుస విజయాలతో తన స్థానాన్ని బలపరుచుకుంది. అక్కడ స్టార్ హీరోల సరసన నటిస్తూ, కమర్షియల్ హిట్స్ అందుకుని కెరీర్‌లో మంచి దశను అందుకుంది. ఈ క్రమంలోనే తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు పవన్ కళ్యాణ్ "ఓజీ" సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు.. ప్రియాంక నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. దాంతో 'ఓజీ' తర్వాత వెంటనే సినిమాలను ఒప్పుకోకుండా, కథలకు ప్రాధాన్యత ఇస్తూ ఆచితూచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మేడ్ ఇన్ కొరియా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇది ఆమె కెరీర్‌లో మొదటి మహిళా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం కావడం విశేషం.

priyanka-arul-mohan-movie-made-in-korea-released-in-netflix-and-got-trending-at-top-at-across-india

ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా..

ఈ సినిమా నేరుగా Netflix ఓటీటీలో విడుదలైంది. 2026 మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తక్కువ అంచనాలతో వచ్చినప్పటికీ, భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి కొరియా వెళ్లాలని కలలు కనే ఓ యువతి కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేమలో మోసపోయిన తర్వాత కూడా ఆమె తన జీవితాన్ని ఎలా మలుచుకుంది? విదేశీ నేలపై తనను తాను ఎలా నిలబెట్టుకుంది? అనే భావోద్వేగ అంశాలతో కథ సాగుతుంది.

సాధారణ కథ అయినప్పటికీ దర్శకుడు దాన్ని భావోద్వేగంగా, రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రియాంక అరుల్ మోహన్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ఆమె ఎమోషనల్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ సినిమాను చాలా మంది "ఫీల్ గుడ్ మూవీ"గా అభివర్ణిస్తున్నారు.

ఇక ఓటీటీలో పరిస్థితులు కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో.. ఈ చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రం Netflixలో ఇండియాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ టాక్ విస్తరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+