హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది..గూస్‌బంప్స్ గ్యారెంటీ బాసూ

Production No. 4: హారర్ సినిమాల ప్రేమికులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త. కేవలం ఊహలతో కాకుండా, నిజ జీవితంలో జరిగిన భీకర సంఘటనల ఆధారంగా ఒక డార్క్ అండ్ డేంజరస్ హారర్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం (ప్రొడక్షన్ నెం. 4), తాజాగా విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్

గూస్ బంప్స్ గ్యారెంటీ

సాధారణంగా హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, ఆత్మలు అనుకుంటాం. కానీ, Inspired by True Events అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా అంతకు మించి ఉండబోతోందని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో గాఢమైన చీకటి, భయం గొలిపే వింత చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ చూస్తుంటే.. థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి? అనే ఉత్కంఠకు రేపు (శుక్రవారం) తెరపడనుంది. చిత్ర యూనిట్ రేపు అధికారికంగా టైటిల్‌ను ప్రకటించనుంది.

Production No 4 Spine-Chilling Pre-look of Surya Directorial Released Oscar Winner Chandra Bose Joins the Team

పాటలు అందిస్తున్న ఆస్కార్ విజేత

ఈ చిత్రానికి టెక్నికల్ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు అందిస్తుండటం విశేషం. సూర్యాస్ ఈ చిత్రానికి కథ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన విజన్ ఈ సినిమాను సరికొత్త స్థాయిలో నిలబెడుతుందని తెలుస్తోంది. తన విభిన్నమైన ట్యూన్స్‌తో ఆకట్టుకునే అచ్చు రాజమణి ఈ హారర్ థ్రిల్లర్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. మహేంద్రనాథ్ కూండ్ల భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహర్షి కూండ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా

షూటింగ్ అప్‌డేట్
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. మిర్లాన్ నసీర్ సినిమాటోగ్రఫీ, వంశీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతున్న ఈ చిత్రం, తెలుగు వెండితెరపై ఒక సరికొత్త హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+