నాశనం చేసింది: పూరీ, చార్మీ బంధంపై సెన్సేషనల్ కామెంట్స్!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు పూరీ జగన్నాథ్, ప్రముఖ నటి చార్మీ కౌర్ వ్యక్తిగత, వృతిపరమైన బంధంపై బాలీవుడ్ నటులు అజాజ్ ఖాన్, షావర్ అలీ చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు అజాజ్ ఖాన్.. టాలీవుడ్‌లో దూకుడు, బాద్‌షా, నాయక్, టెంపర్, హార్ట్ ఎటాక్ వంటి చిత్రాలలో విలన్ పాత్రలు పోషించాడు. అలాగే గోలీమార్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మరో నటుడు షావర్ అలీతో కలిసి అజాజ్ ఖాన్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారు టాలీవుడ్‌లో తమ అనుభవాలను పంచుకుంటూ పూరీ జగన్నాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాప్ హీరోలు దూరం కావడానికి ఆమే కారణం!
ఈ పాడ్‌కాస్ట్‌లో అజాజ్ ఖాన్, షావర్ అలీ ఇద్దరూ పూరీ జగన్నాథ్‌ను తాము పనిచేసిన అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా కొనియాడారు. షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు తమను ఎంతో గౌరవంగా సార్ అని పిలిచేవారని అజాజ్ గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ తర్వాత సంభాషణ పూర్తిగా వివాదాస్పద మలుపు తిరిగిందని చెప్పాడు. చార్మీతో ఉన్న సంబంధం వల్లే పూరీ జగన్నాథ్ తన వృత్తిపరమైన కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని పాడుచేసుకున్నాడని వారు ఆరోపించారు. చార్మీ ప్రమేయం పెరిగిపోవడంతో టాలీవుడ్‌లోని పలువురు టాప్ హీరోలు క్రమంగా పూరీతో పనిచేయడం మానేశారని, దీనివల్ల ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ఉన్న పూరీ కెరీర్ పతనమైందని వారు పేర్కొన్నారు.

Puri Jagannadh Ruined Career and Family Due to Charmme Actors Ajaz Khan and Shawar Ali Shocking Claims

మా కెరీర్లు కూడా నాశనమయ్యాయి!
ఒకప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్స్ పూరీ జగన్నాథ్‌తో సినిమాలు చేసేందుకు ఎంతగానో ఆరాటపడేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అజాజ్ ఖాన్, షావర్ అలీలు కామెంట్ చేశారు. పూరీకి ఒకప్పుడు అత్యంత ఆప్తులుగా ఉన్నవారు కూడా చార్మీ ప్రవర్తన పట్ల అసంతృప్తితో ఉన్నారని వారు ఆరోపించారు. బయటి నుంచి వచ్చిన చార్మీ.. పూరీ జగన్నాథ్ వృత్తిపరమైన, వ్యక్తిగత నిర్ణయాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుందని అన్నారు. కేవలం ఒకే ఒక్క స్త్రీ (చార్మీ) వల్ల పూరీ తన కెరీర్‌ను, పరువును, కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడని, అంతేకాకుండా ఆమె వల్లే టాలీవుడ్‌లో తమ కెరీర్‌లు కూడా దెబ్బతిన్నాయని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం అజాజ్ ఖాన్, షావర్ అలీలు చేసిన వ్యక్తిగత ఆరోపణలు మాత్రమేనని.. వీటిపై దర్శకుడు పూరీ జగన్నాథ్ కానీ, చార్మీ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పందన తెలియజేయలేదని గమనించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+