తెలంగాణలో SIR ప్రక్రియ మొదలు- ఆన్ లైన్, ఆఫ్ లైన్లో ఇలా చేసుకోండి..!
తెలంగాణలో ఎన్నికల సంఘం ఇవాళ ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR) ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికీ బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) పర్యటించబోతున్నారు. జులై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరగనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,985 పోలింగ్ బూత్‌ల పరిధిలోని 3.38 కోట్ల మంది ఓటర్లకు వీరు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారు. ముసాయిదా జాబితా జులై 31న ప్రచురిస్తారు. అనంతరం జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు పిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు సందేహాలపై నోటీసులు ఇచ్చి అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటిస్తారు.
అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనది ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో తమ పాత ఓట్లను లింక్ చేసుకునేందుకు (Enumeration) ఓటర్లకు అవకాశం ఉంటుంది. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన వారి ఓటర్ కార్డుల వివరాల ఆధారంగా బీఎల్వోలు ఇంటింటికీ వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. ఒక్కో ఓటరుకు రెండు కాపీలు ఇస్తారు. ఈ రెండింటినీ నింపిన తర్వాత తిరిగి బీఎల్వోలు వచ్చి అందులో ఒక దాన్ని తీసుకుంటారు. అలాగే రెండో ఫారంపై సంతకం చేసి అది తమకు అందినట్లుగా ధృవీకరిస్తారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దీన్ని చూపించవచ్చు.ఇలా ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకున్న తర్వాత అందులో వివరాల ఆధారంగా జాబితా తయారు చేస్తారు.

నేటి నుంచి జులై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరగనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,985 పోలింగ్ బూత్‌ల పరిధిలోని 3.38 కోట్ల మంది ఓటర్లకు BLOలు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తారు. ముసాయిదా జాబితా జులై 31న ప్రచురించి, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు పిర్యాదులు,… pic.twitter.com/Td7ZTn4xeB
— TG Govt Updates (@TGGovtUpdates) June 25, 2026
మరోవైపు ఆన్ లైన్ లో ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు వీలుంది. ఎన్నికల సంఘం అధికారిక యాప్ ఈసీఐ నెట్ ను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే ఈసీఐ ఓటర్స్ వెబ్ సైట్ ఉంటుంది. ఇందులోకి వెళ్లి కూడా ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు. ఇందుకు గాను యాప్ లేదా వెబ్ సైట్లో 2002 ఓటర్ల జాబితా సవరణ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులోకి వెళ్లిన తర్వాత అప్పట్లో ఓటు వేసిన రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్, పేరు వంటి వివరాలు ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలను ప్రస్తుత ఎన్యుమరేషన్ ఆప్షన్ లోకి వెళ్లి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
SIR ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలో క్లియర్గా ఈ వీడియోలో ఉంది, ఒకసారి చూసి అర్థం చేసుకోగలరు. ఫారంలో పేరు, వయసు, చిరునామా, డాక్యుమెంట్లు వంటి వివరాలు సరిగా రాయడం వల్ల సర్వేలో ఇబ్బంది ఉండదు. pic.twitter.com/NGlW83HGG7
— TG Govt Updates (@TGGovtUpdates) June 25, 2026
ఆధార్ కార్డులోనూ, ప్రస్తుత ఓటర్ ఐడీలోనూ పేరు స్పెల్పింగ్ తో సహా ఒకేలా ఉంటే ఆన్ లైన్ లో ఈ-సైన్ ద్వారా ఆథరైజేషన్ పూర్తవుతుంది. దీంతో ఓటరు పని పూర్తవుతుంది. మిగతా పని ఎన్నికల అధికారులు చూసుకుంటారు. ఆధార్, ఓటర్ ఐడీలో పేర్లు వేరేగా ఉంటే మాత్రం బీఎల్వో ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎన్యుమరేషన్ కోసం సమర్పించిన వివరాలు తేడా వస్తే మాత్రం ఎన్నికల సంఘం సూచించిన పత్రాల్ని సమర్పించి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications