ప్రభుత్వం లేదు.. పవర్ లేదు, కానీ- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ఒకరి పై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ సైతం తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తిరిగి అధికారంలోకి వస్తామని అటు సీఎం రేవంత్ ధీమాగా చెబుతుండగా.. ఇటు బీఆర్ఎస్ తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉంది. బీజేపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం లేదు.. పవర్ లేదు కానీ గర్వంగా ఎక్కడనిపిస్తుందంటే ఎమ్మెల్యే పోయినా.. ఎంపీ పోయినా.. అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇక్కడికొచ్చి మీరు చేస్తున్న ప్రకటన మామూలు ప్రకటన కాదు.. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీ గుండెల్లో రైళ్లను ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనిపిస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్ శిక్షణా కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. "మనకు అధికారం పోయి రెండున్నరేళ్లు అయింది. ఎన్నికల ముందేమో నేను గుంపు మేస్త్రీని. రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఫోజులు కొట్టిండు. ఇవాళ రియల్ ఎస్టేట్‌ను ఏం చేసిండు మరి.. బొంద పెట్టిండు.. వంద ఫీట్ల అడుగులో పాతిపెట్టే పని చేసిండని మండిపడ్డారు.

తిరిగి అధికారంలోకి రావటం ఖాయం
దీనికి కొనసాగింపుగా.."మన ప్రభుత్వం, పెద్దలు కేసీఆర్ ఉన్నప్పుడు షాబాద్‌లో చందన్ వెల్లిలోకానీ, సీతారాంపూర్‌లో కానీ ఎకరం 30 లక్షలుండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఒక మెక్రోసాఫ్ట్, అమెజాన్ వెల్స్‌ఫన్ ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత నేడు ఎకరం ౩ కోట్లకు తక్కువ షాబాద్‌లో లేని పరిస్థితి ఉంది. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్లు, చెల్లెళ్లందరూ ఇవాళ దివాళా తీసే పరిస్థితి వచ్చిందంటూ.." కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఎందుకీ పరిస్థితి ఉందనేది మనం ఆలోచన చేసుకోవాల్సి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications