కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ పై కీలక నిర్ణయం - మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో రెండు లక్షల కొత్త పెన్షన్లు అందిస్తామ ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారీ సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు రావటంతో ప్రభుత్వం ఇప్పుడు వీటి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి దరఖాస్తులతో పాటు గా కొత్త వాటి కోసం లబ్దిదారులు వేచి చూస్తున్నారు. దీంతో.. కొత్త దరఖాస్తుల స్వీకరణ.. మంజూరు పైన తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పంపిణీ ముహూర్తం పైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. పెన్షన్ల కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారికి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సెర్ప్ అధికారులు సర్వే చేపడుతున్నారు. వచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తామని ఇప్పటికే మంత్రి సీతక్క ప్రకటించారు. అయితే, తమకు అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని వృద్దులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. ఈ సర్వే తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖారుతో సర్వే ముగియనుండగా.. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.

వచ్చే నెల నుంచి పెన్షన్ల పంపిణీ
కాగా, నిజమైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థను రంగంలోకి దింపింది. ఈ సంస్థ లైవ్ అథెంటికేషన్ సర్వే చేపడుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనర్హులను గుర్తిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో బ్యాంక్ అకౌంట్లలో నేరుగా పింఛన్లు పొందుతున్నవారు 19,04,239 మంది ఉన్నారు. వీరిలో 93,624 మందిని అనర్హులుగా గుర్తించింది. 40,751 మంది మరణించగా.. వీరి పేరిట ఇంకా నిధులు విత్ డ్రా అవుతున్నట్లు గుర్తించారు. 41,689 మంది ఆచూకీ లభించడం లేదు. 3,495 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. 11 వేల మంది ఆధార్లు చెల్లకపోగా.. వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ప్రస్తుతం 15.97 లక్షల మంది సర్వే పూర్తి చేశారు. కాగా.. ఇక నుంచి పెన్షన్లను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.













Click it and Unblock the Notifications