జనసేన కార్యాలయంలో రామ్ చరణ్ - బిగ్ మూమెంట్, మెగా హింట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 2029 ఎన్నికలే టార్గెట్ గా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అటు వైసీపీ సైతం రాజకీయంగా తిరిగి తమ కార్యాచరణ వేగవంతంగా అమలు చేస్తోంది. ఈ సమయంలోనే పవన్ జనసేనను క్షేత్ర స్థాయిలో బలోపేతం పైన ఫోకస్ చేసారు. పలు నియామకాలు చేపట్టారు. కాగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనసేన కార్యాలయంకు రావటం పైన ఆసక్తి కర చర్చ మొదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చారు. జనసేన ఏర్పాటు నుంచి పార్టీ వ్యవహారాలకు రామ్ చరణ్ దూరంగానే ఉంటున్నారు. పవన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో బాబాయ్ కు మద్దతుగా వచ్చారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తరువాత తొలి సారి పార్టీ కార్యాలయానికి రావటంతో.. కొత్త చర్చ మొదలైంది. అయితే, బాబాయ్ పవన్ ను కలిసేందుకే రామ్ చరణ్ వచ్చారని చెబుతున్నారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నారు. చాలాకాలం తర్వాత బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 ముగింపు దశ మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు.
పవన్ తో ఆత్మీయ భేటీ వేళ
కాగా, ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్‌ను కలిశారు.చరణ్‌ను చూసిన పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా స్వాగతం పలికి, శాలువాతో సత్కరించినట్లు సమాచారం. ఇద్దరూ కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కుటుంబ విషయాలతో పాటు సినీ ప్రాజెక్టులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కు అవసరమైతే మెగా హీరోలు ఈ సారి రాజకీయంగానూ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే సంకేతంగా ఈ భేటీ పైన విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, పూర్తిగా ఇది మర్యాద పూర్వక భేటీగానే పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ భేటీ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications