దీక్షలోకి పవన్ కళ్యాణ్- నిత్యం ఈ కఠిన నియమాలతో..!!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని మంగళాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. నృసింహాలయంలో ప్రత్యేక అర్చనలు చేయించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ వారాహి దీక్ష చేపట్టారు. ఆయన ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఆయన ఈ దీక్షను క్రమం తప్పకుండా యేటా స్వీకరిస్తున్నారు. ఈ దీక్షా కాలంలో పవన్ నిత్యం కఠిన నియమాలు అనుసరిస్తారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారాహి దీక్ష ప్రారంభించారు. మంగళగిరిలోని సింహాలయంలో ప్రత్యేక అర్చనలు చేయించిన అనంతరం పవన్‌ వారాహి దీక్ష ప్రారంభించారు. కార్తీక మాసంలో ఈ దీక్ష విరమిస్తారు. దీక్షా కాలంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం తీసుకుంటూ విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్ర ధారణను ధరిస్తుంటారు. పవన్‌కల్యాణ్‌ తొలుత లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుముఖంగా స్వీకరించిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఏటా ఈ దీక్ష చేపడుతున్నారు.

చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు- రూట్, షెడ్యూల్..!!
చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు- రూట్, షెడ్యూల్..!!
Deputy Chief Minister Pawan Kalyan Starts 11-Day Varahi Vijaya Deeksha Seeking Divine Blessings here the details

దీక్షా కాలంలో కఠిన నియమాలతో

కాగా, దీక్ష కాలంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం, నిత్య అనుష్ఠానాలు నిర్వహించడం, దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేయడం వంటి కఠిన నియమాలను పవన్ కళ్యాణ్ పాటిస్తారు. విధి నిర్వ హణకు అనుగుణంగా సాధారణ జీవనం కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక సాధనకు ఎక్కువగా సమయం కేటాయిస్తారు. దీక్ష సమయంలో ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణలో కనిపించే పవన్ కళ్యాణ్... రాజకీయ బాధ్యతల మధ్య కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా పవన్ కీలక నియామకాలు చేపట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ నియామకాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా రాజకీయంగానూ పవన్ జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+