9వ తరగతి సిలబస్‌లో 1975 ఎమర్జెన్సీ పాఠాలు? నిజం ఏంటంటే..

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టమైన 1975 నాటి జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ముచ్చట్లు ఇకపై స్కూల్ విద్యార్థులు చదువుకోనున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించి దాదాపు యాభై ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రం (సోషల్ స్టడీస్) సిలబస్‌లో ఈ అంశాన్ని ఒక ప్రత్యేక పాఠంగా చేర్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 'Understanding Society: India and Beyond' అనే కొత్త పుస్తకంలో ఈ మార్పులు చేశారని పలు వార్తా కథనాలు ప్రచురించింది జాతీయ మీడియా. ఇలా తొమ్మిదో తరగతి స్థాయిలోనే ఎమర్జెన్సీ గురించి అధికారికంగా పరిచయం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.

జేపీ ఉద్యమం.. హక్కుల హరణపై విశ్లేషణ:

ఇంటర్నెట్, మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త బుక్స్ లో.. 1975 నుంచి 1977 మధ్య దేశంలో జరిగిన పరిణామాలను సమగ్రంగా వివరించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని ఇందులో చర్చించారు. అలాగే కేవలం అంతర్గత కల్లోలాల సాకుతో ఎమర్జెన్సీ విధించి పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేయడం, ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం, పత్రికలపై ఆంక్షలు (సెన్సార్‌షిప్) విధించడం వంటి ఆనాటి చీకటి రోజులను విద్యార్థులకు అర్థమయ్యేలా విశ్లేషించారు. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నడిపిన చారిత్రాత్మక ప్రజా ఉద్యమం, యువత పోరాటం.. చివరకు 1977 ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకున్నారనే విషయాలను ఇందులో ప్రముఖంగా మలిచారు.

FACT CHECK NCERT Includes 1975 Emergency in Class 9 Syllabus Official Download Links Released

అదంతా ఫేక్ న్యూస్..

ఇంటర్నెట్, మార్కెట్లో ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పేరుతో చలామణీ అవుతున్న అనధికారిక, పైరేటెడ్ (నకిలీ) పాఠ్యపుస్తకాలపై అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా, వివిధ వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రం పార్ట్-1 (Class IX Social Science Part 1) పుస్తకం "Understanding Society: India & Beyond" కి సంబంధించిన ఒక నకిలీ డిజిటల్ వర్షన్ విపరీతంగా షేర్ అవుతున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ గుర్తించింది.

నేడే టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు! డైరెక్ట్ లింక్ ఇక్కడే
నేడే టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు! డైరెక్ట్ లింక్ ఇక్కడే

అధికారిక వనరులనే నమ్మండి:

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరూ కూడా ఇంటర్నెట్‌లో దొరికే అనామక లింకులు, యాప్‌లు లేదా ముందే లీకయ్యాయంటూ ప్రచారంలోకి వచ్చే మెటీరియల్స్ నమ్మి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను కేవలం వారి అధికారిక వెబ్‌సైట్ (ncert.nic.in), ఈ-పాఠశాల (ePathshala) పోర్టల్ లేదా ప్రభుత్వం గుర్తించిన అధీకృత వెండర్ల (Authorized Vendors) ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. నకిలీ కంటెంట్‌ను ప్రచారం చేసేవారిపై, పైరసీకి పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ హెచ్చరించింది.

AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!
AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!

ఒరిజినల్ పుస్తకాల కోసం అధికారిక లింకులు ఇవే:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+