Infinix NOTE 60 Pro నుంచి స్పెషల్ ఎడిషన్ లాంఛ్.. కిర్రాక్ డిజైన్ !!
ప్రస్తుతం 5జీ టెక్నాలజీ దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్లో 5G ఫోన్ల డిమాండ్ గట్టిగానే ఉంది. కస్టమర్లను పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ లో సైతం అదిరిపోయే ఫీచరను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో డిజైన్, పనితీరు, ప్రీమియం ఫీల్‌కు కొత్త నిర్వచనం Infinix సపరేట్ క్రేజ్ సంపాదించుకుంది. లేటెస్ట్ గా తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ "NOTE 60 Pro Pininfarina Limited Edition"ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ పినినఫారినా (Pininfarina)తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ ఫోన్, సూపర్‌కార్‌ల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తో టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా లగ్జరీ, పనితీరు, అత్యాధునిక ఫీచర్ల కలయికగా ఈ డివైస్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఫోన్ సైడ్‌ల వెంట, కెమెరా మాడ్యూల్ చుట్టూ అందించిన రెడ్ యాక్సెంట్ స్ట్రిప్స్ స్పోర్ట్స్ కార్ల స్టైలింగ్‌ను గుర్తు చేస్తాయి. అదనంగా వెనుక భాగంలో ఏర్పాటు చేసిన Active Matrix Rear Display ఈ ఫోన్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో సమయం, బ్యాటరీ స్థాయి, నోటిఫికేషన్లు, కాల్ అలర్ట్‌లు వంటి సమాచారాన్ని సులభంగా చూడవచ్చు.

అన్‌బాక్సింగ్‌లోనే ప్రీమియం అనుభవం
ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‌ను కేవలం డివైస్‌గా కాకుండా పూర్తి ప్రీమియం ప్యాకేజీగా అందిస్తోంది. ప్రత్యేక డిజైన్‌తో రూపొందించిన రిటైల్ బాక్స్‌లో 90W ఫాస్ట్ ఛార్జర్, బ్రెయిడెడ్ USB Type-C కేబుల్, MagPad వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, మాగ్నెటిక్ రింగ్‌తో కూడిన ట్రాన్స్‌పరెంట్ ప్రొటెక్టివ్ కేస్, ప్రత్యేక పినినఫారినా బ్రాండెడ్ సిమ్ ఎజెక్టర్ టూల్‌ను అందిస్తున్నారు. దీంతో వినియోగదారులకు అన్‌బాక్సింగ్ నుంచే లగ్జరీ అనుభవం లభిస్తుంది.
ఫోన్ ఫీచర్స్..
డిజైన్..
NOTE 60 Pro Pininfarina Limited Editionలో ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేక డిజైన్. రేసింగ్ కార్లలో ఉపయోగించే కార్బన్ ఫైబర్ టెక్స్చర్‌ను పోలి ఉండే కార్బన్ ఫైబర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. 360 డిగ్రీల ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించిన ఈ డివైస్ చేతిలో పట్టుకున్నప్పుడు లగ్జరీ గ్యాడ్జెట్ అనుభూతిని కలిగిస్తుంది.
డిస్‌ప్..
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, గేమింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో నేరుగా సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 2304Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అదనంగా Gorilla Glass 7i రక్షణ ఉండటంతో స్క్రీన్ గీతలు, చిన్నపాటి డ్యామేజ్‌ల నుంచి రక్షణ పొందుతుంది.
ప్రాసెసర్..
పనితీరు విషయంలో కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో వచ్చింది. Qualcomm Snapdragon 7s Gen 4 చిప్‌సెట్‌తో రూపొందించిన ఈ డివైస్ మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, AI ఆధారిత యాప్‌లను సులభంగా నిర్వహించగలదు.
స్టోరేజ్..
8GB LPDDR5X RAM, 256GB UFS స్టోరేజ్ కలయిక వేగవంతమైన పనితీరును అందిస్తుంది. అవసరమైతే RAM ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీ ద్వారా అదనపు వర్చువల్ RAMను కూడా ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఫోన్ మరింత స్మార్ట్ అనుభవాన్ని అందిస్తుంది.
కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఏర్పాటు చేశారు. OIS (Optical Image Stabilization) సపోర్ట్ ఉండటంతో తక్కువ వెలుతురులో కూడా స్థిరమైన ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. 8MP అల్ట్రా వైడ్ కెమెరా ద్వారా విస్తృత దృశ్యాలను క్యాప్చర్ చేయవచ్చు. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో కంటెంట్ క్రియేటర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉండటంతో వీడియో కాల్స్, సోషల్ మీడియా ఫోటోలు మరింత నాణ్యంగా వస్తాయి.
6500mAh భారీ బ్యాటరీ.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించే సామర్థ్యం దీనికి ఉందని కంపెనీ చెబుతోంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం కొన్ని నిమిషాల్లోనే గంటల తరబడి ఉపయోగించేంత ఛార్జ్ పొందవచ్చు. అదనంగా 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం ఈ విభాగంలో అరుదైన ఫీచర్‌గా చెప్పవచ్చు.
అదనపు ఫీచర్లు..
NOTE 60 Pro Pininfarina Editionలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, JBL ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు, Hi-Res Audio సపోర్ట్, NFC, IR బ్లాస్టర్, Wi-Fi 6, Bluetooth 5.4 వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే AI ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్, AI ఫోటో ఎడిటింగ్ టూల్స్, AI నాయిస్ క్యాన్సిలేషన్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ధర..
న్ఫినిక్స్ NOTE 60 Pro Pininfarina Limited Edition 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా నిర్ణయించారు.
లభ్యత..
జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్లు..
లాంచ్ ఆఫర్లలో భాగంగా HDFC, Axis Bank, ICICI Bank, SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా రూ.2,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications