Passports Act 1967 అసలు నిజాలివే! ‘సెక్షన్ 20’ లో ఏముంది?

"భారతదేశ పాస్‌పోర్ట్ ఉంటే.. మీరు భారత పౌరులని ఖచ్చితంగా చెప్పలేం!" – కేంద్ర ప్రభుత్వం గురువారం చేసిన ఈ స్పష్టీకరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పొలిటికల్, లీగల్ చర్చకు తెరలేపింది. సాధారణ ప్రజలు పాస్‌పోర్ట్‌ను దేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావిస్తున్న తరుణంలో.. అది పౌరసత్వానికి తిరుగులేని సాక్ష్యం లేదా ఖచ్చితమైన రుజువు కాదని, ఈ విషయంలో గత 12 ఏళ్లలో గానీ, లేదా ఇటీవల గానీ ఎలాంటి కొత్త నిర్ణయం లేదా మార్పులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఇటీవల విదేశాంగ శాఖ (MEA) నిర్వహించిన ఒక మీడియా బ్రీఫింగ్‌లో.. పాస్‌పోర్ట్ అనేది ప్రాథమికంగా కేవలం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఉపయోగించే ప్రయాణ సౌలభ్య పత్రం (Travel Document) మాత్రమేనని, అది దేశ పౌరసత్వాన్ని స్వయంచాలకంగా నిర్ధారించదని పేర్కొనడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

What Is Passport Act 1967 Centre Explains Section 20 And Why Passport Is Just A Valid Travel Document

పాస్‌పోర్ట్‌ల చట్టం, 1967: 'సెక్షన్ 20’ లో ఏముంది?

ఈ వివరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా అమల్లో ఉన్న చట్టబద్ధమైన స్థితినే ముందుకు తెచ్చింది. పాస్‌పోర్ట్‌ల చట్టం, 1967 లోని సెక్షన్ 20 (Section 20 of the Passports Act, 1967) నిబంధనల ప్రకారం.. భారత ప్రభుత్వం పౌరులు కాని వారికి (Non-Citizens) కూడా ప్రత్యేక పరిస్థితుల్లో, అంతర్జాతీయ నిబంధనలు లేదా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైనప్పుడు పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాలను జారీ చేసే సర్వాధికారాలను కలిగి ఉంది.

సెక్షన్ 20 నిబంధన చట్టంలో ఇలా ఉంది:

"పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాల జారీకి సంబంధించిన నిబంధనలలో ఏమున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే, భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు లేదా జారీ చేసేలా చర్యలు తీసుకోవచ్చు."

చట్టంలోనే పౌరులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్ ఇచ్చే వెసులుబాటు ఉన్నందున.. కేవలం పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి పౌరసత్వం సిద్ధించదని అధికారులు వివరించారు. దీనికి అదనంగా, 2013 నాటి బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పులను కూడా కేంద్రం ఉదహరించింది. పాస్‌పోర్ట్ కలిగి ఉండటం అనేది పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన ముగింపు కాదని న్యాయస్థానం అప్పట్లోనే స్పష్టం చేసింది. చట్టపరమైన పరిభాషలో ఇది ఒక వ్యక్తి పౌరసత్వ వాదనకు బలమైన మద్దతు ఇచ్చే పత్రం కావచ్చు కానీ, అంతిమ అర్హత మాత్రం భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుంది.

పౌరసత్వం కోసం అదొక్కటి చాలు..! కేంద్రం నిర్ణయంపై తేల్చేసిన ఓవైసీ..!
పౌరసత్వం కోసం అదొక్కటి చాలు..! కేంద్రం నిర్ణయంపై తేల్చేసిన ఓవైసీ..!

రాజీకీయ దుమారం.. విపక్షాల ప్రశ్నల వర్షం

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ 'ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. "పాస్‌పోర్ట్‌ పౌరసత్వానికి రుజువు కాకపోతే, మరి ఏ ఆధారాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి? రేపు ఒక బిఎల్ఓ (BLO) వచ్చి నా పౌరసత్వాన్ని అనుమానించి, నా ఓటు హక్కును లాగేసుకుంటే.. ఫలితంగా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుంది. ఈ రకమైన వివరణలు సాధారణ ప్రజలను ఓటు హక్కుకు దూరం చేసేలా మారే ప్రమాదం ఉందంటూ సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలి" అని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Passport ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్..!
Passport ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్..!

1955 పౌరసత్వ చట్టం: అసలైన ఆధారాలు ఇవే!

విపక్షాల విమర్శలపై బీజేపీ ప్రముఖుడు అమిత్ మాలవీయ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'కాగజ్ నహీ దిఖాయేంగే’ (కాగితాలు చూపించం) అంటూ గతంలో నిరసనలు తెలిపే బ్యాచ్‌కి ఇదొక రియాలిటీ చెక్ అని ఆయన ఎద్దేవా చేశారు. విదేశాంగ శాఖ ఎలాంటి కొత్త పాలసీని తీసుకురాలేదని, దశాబ్దాలుగా ఉన్న చట్టాన్ని మాత్రమే అధికారులు గుర్తుచేశారని అన్నారు.

భారతదేశంలో పౌరసత్వం అనేది 1955 పౌరసత్వ చట్టం (Citizenship Act, 1955) ఆధారంగానే లెక్కిస్తారని ఆయన తెలిపారు. కేవలం ఒకే ఒక పత్రంతో కాకుండా..

  • జనన ధృవీకరణ పత్రాలు (Birth Certificates)
  • తల్లిదండ్రుల పౌరసత్వ రికార్డులు (Parents' Citizenship Records)
  • పాఠశాల రికార్డులు (School Records)
  • ఓటర్ల జాబితా నమోదు (Electoral Roll Entries)
  • ప్రభుత్వ సేవా రికార్డులు, భూమి మరియు నివాస ఆధారాలు (Land & Residence Records)
  • వంటి అధికారిక పత్రాల కలయిక, సహాయక సాక్ష్యాల ద్వారానే భారతదేశంలో పౌరసత్వం ఖరారవుతుందని వివరించారు.

పాస్‌పోర్ట్ సేవా దివస్ వేళ స్పష్టత..

దేశంలో 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్‌ను జరుపుకుంటున్న తరుణంలో ఈ అంశం తెరపైకి రావడం గమనార్హం. 1967 జూన్ 24న పాస్‌పోర్ట్‌ల చట్టం అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రజలకు తప్పుదోవ పట్టే సమాచారం చేరకూడదనే ఉద్దేశంతోనే.. పాస్‌పోర్ట్ ప్రయోజనాలకు, రాజ్యాంగ పౌరసత్వ నిబంధనల మధ్య ఉన్న చట్టపరమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి కేంద్రం ఈ పటిష్టమైన స్పష్టతను ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+