70 డాలర్లకే క్రూడాయిల్- ఇంకా పెట్రోల్ 116 రూపాయలా ?

ఇరాన్-అమెరికా వార్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. తాజాగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 70 డాలర్లకు పడిపోయింది. అయినా భారత్ లో మాత్రం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడం లేదు. ఆ విధంగా చమురు సంస్ధలకు కోట్ల రూపాయలు ఆర్జించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ దోపిడీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఇరాన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ (Crude Oil) రేట్ల పెరుగుదలను సాకుగా చూపి మరీ పెట్రోల్ రేట్లు పెంచేసిన కేంద్రం.. ఇప్పుడు అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో రేట్లు తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ఫైర్ అయ్యారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గినా ఆ ప్రయోజనం దేశంలో వినియోగదారులకు ఎందుకు బదిలీ చేయడం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Crude Oil at Pre-War Low So Why Is AP Paying 116 Litre Vijayasai Reddy Questions Centre

ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు $70 వద్ద-అంటే దాదాపు యుద్ధానికి ముందునాటి స్థాయికి-చేరుకున్నందున, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ పూరీని విజయసాయిరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పెట్రోల్ లీటరుకు ₹116 చెల్లిస్తున్నారని ఆయనకు గుర్తుచేశారు. ఇది వారి జేబులకు తీవ్ర భారాన్ని కలిగిస్తోందన్నారు. సాధ్యమైనంత వరకు వారికి ఉపశమనం కల్పించాలని సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+