వంకాయ నిల్వ పచ్చడి చూస్తేనే నోరూరుతుంది.. తింటే...

వంకాయ కూరగా, ఫ్రై గా, రోటి పచ్చడిగానే కాకుండా నిల్వ పచ్చడిగా కూడా చేస్తూ ఉంటారు. వంకాయ నిల్వ పచ్చడి చాలా మందికి ఇష్టమైనది. అయితే ముదిరిన వంకాయలతోనే పచ్చడి చెయ్యాలి. అప్పుడే అది రుచిగా ఉంటుంది. అన్నం, దోసె, ఇడ్లీతో కలిపి తింటే రుచి వేరేలా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసే పద్ధతి. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు (కొలతలు):

వంకాయలు - 1 కిలో (ముదిరినవి)
వేరుశనగ నూనె - 200 మి.లీ
చింతపండు: 250 గ్రాములు
ఉప్పు: 120 గ్రాములు
కారం: 160 గ్రాములు
పసుపు: పావు స్పూన్
వెల్లుల్లి పేస్ట్ లేదా రెబ్బలు: 2 పెద్ద వెల్లుల్లి
ఇంగువ - చిటికెడు
ఆవాలు - 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్
మెంతి గింజలు - 4 టీ స్పూన్
పసుపు - 1 టీ స్పూన్

vankaya nilva pachadi Traditional Andhra-style Vankaya Nilva Pachadi recipe with exact measurements

తయారీ విధానం:

ముందుగా వంకాయలను బాగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోండి. నీళ్లు పూర్తిగా ఆరిపోయేలా ఉంచండి. లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. పాన్‌లో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, మెంతి గింజలు వేసి లైట్‌గా వేయించి దించుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోండి. మిగతా నూనెలో వంకాయ ముక్కలు వేసి బాగా వేయించండి. వంకాయలు మెత్తబడి నూనె పైకి తేలే వరకు వేయించాలి.

గ్రామాల్లో వీధికుక్కల నుండి బిగ్ రిలీఫ్.. కీలకనిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్!
గ్రామాల్లో వీధికుక్కల నుండి బిగ్ రిలీఫ్.. కీలకనిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్!

ఇలా చేస్తే టేస్టీ వంకాయ పచ్చడి

ఆ తర్వాత వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించి, పసుపు, ఉప్పు, పులుసు, కారం వేసి కలపండి. చివర్లో ముందు చేసిన పొడిని వేసి బాగా కలపండి. ఆపై పచ్చడిలో పోపు వేసి బాగా కలపండి. పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఈ పచ్చడి సరిగ్గా చేస్తే 1-2 నెలలు సులభంగా నిల్వ ఉంటుంది. ప్రతిసారి పొడి చెంచాతోనే తీసుకోండి. తేమ తగలకుండా చూసుకుంటే చాలా కాలం పాటు రుచిగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+