'పుష్ప2' షో పడింది... టాక్ ఎలా ఉందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర యూనిట్ కు కూడా పుష్ప2 అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. తొలిరోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు మించి కలెక్షన్లు కొల్లగొట్టాలనేది పుష్ప2 పెట్టుకున్న లక్ష్యం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. మొత్తం అన్ని కట్స్ పోను 3 గంటల 20 నిముషాలపాటు సినిమా రన్ టైం ఉంది.
జాతర ఎపిసోడ్ హైలైట్
సినిమాలో ప్రధానంగా జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ లో పోర్ట్ వేదికగా జరిగే ఫైట్, జపాన్ లో తీసిన ఎపిసోడ్, ఇంద్ర సినిమా ఆడుతున్న థియేటర్ లో ఫైట్స్ ఒకదాన్ని మించి మరొకటి వచ్చాయి. జాతర ఎపిసోడ్ లో గంగమ్మ తల్లికి మొక్కు తీర్చి శత్రువులను తుక్కు తుక్కున కొట్టే సన్నివేశం మాత్రం అదిరిపోయే రీతిలో వచ్చిందంటున్నారు. వీటన్నింటితోపాటు దర్శకుడు సుకుమార్ ప్రతి పావుగంటకు ఎలివేషన్లు ఇచ్చేలా సీన్లు రాసుకున్నారు. ఫాహద్ ఫజిల్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ అప్పటి నుంచి మాత్రం సినిమా అదిరిపోతుందంటున్నారు. విపరీతమైన హైప్ ఇచ్చేలా ఉన్న ఈ సీన్లను సుకుమారు రాసుకున్న తీరు, తీర్చిదిద్దిన విధానం చాలా బాగున్నాయనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

ఊర మాస్ కంటెంట్
సెన్సార్ అధికారులు చెబుతున్నదాని ప్రకారం ఊర మాస్ కంటెంట్ తో ప్రేక్షకులను బాగా సినిమా అలరిస్తుందని, అల్లు అర్జున్ తో శ్రీలీల పాట బాగా వచ్చిందని, టోటల్ గా సినిమా మొత్తం చూసిన తర్వాత ప్రేక్షకులు ఉర్రూతలూగిపోవడం ఖాయమని సెన్సార్ రిపోర్ట్. సెన్సార్ కు వెళ్లడానికి ముందు ఈ సినిమాను ముఖ్యుల కోసం అన్నపూర్ణ స్టూడియోలో షో కూడా వేశారు. హీరో, నిర్మాత, దర్శకులతోపాటు, బన్నీ తండ్రి అల్లు అరవింద్ లాంటివారంతా చూశారు. సినిమా పూర్తయిన తర్వాత అల్లు అరవింద్ అల్లు అర్జున్ ను ఆలింగనం చేసుకొని సంతోషపడ్డారు. సినిమా మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంటూ అల్లు అరవింద్ చెప్పారు. వీరంతా చూసిన తర్వాతే సెన్సార్ కు పంపించారు. అక్కడ కూడా అదిరిపోయిందంటూ టాక్ రావడంతో సినిమా యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది.












Click it and Unblock the Notifications