'పుష్ప2': తెలుగులో భారీ టార్గెట్... అంత రాకపోతే ఫ్లాప్ కింద లెక్క
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తోపాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్... వీరందరికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది పుష్ప2 సినిమా. ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల చేయబోతున్నారు. తమకు నచ్చిన భాషలో చూసుకునేందుకు నిర్మాతలు సినీ డబ్స్ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ఎంపిక చేసిన ఆరు భాషల్లో ప్రేక్షకులు కావాలటే ఈ ఆప్ ద్వారా సినిమాను చూడొచ్చు. డిసెంబరు ఐదోతేదీకి ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది.
నైజాంలో రూ.100 కోట్లకు అమ్మారు
నాలుగోతేదీ రాత్రి 11.00 గంటలకే షోలు వేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఇంకా టికెట్ల బుకింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ, తెలంగాణకు కలిపి పుష్ప2 ఎంత వసూలు చేయాల్సి ఉంటుంది? ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది? రాకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు ఆంధ్రలో రూ.90కోట్లకు అమ్మగా, నైజాంలో రూ.100 కోట్లకు అమ్మారు. సీడెడ్ లో రూ.30 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ ధరలకు బయ్యర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు.

రూ.450 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది
20 శాతం కమిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, థియేటర్ అద్దెలు, 18 శాతం జీఎస్టీ అన్నీ తీస్తే రూ.220 కోట్లు సినిమా వసూలు చేయాల్సి ఉంది. అంటే దాదాపుగా పుష్ప2 ఏపీ, తెలంగాణలో రూ.450 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది పెద్ద టార్గెట్ అని చెప్పొచ్చు. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చినంతస్థాయిలో కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. సినిమా టాక్ బాగుంటే కొంతకాలం ఓర్పు వహించినా ఎలాగోలా నెట్టుకు రావొచ్చు.
థియేటర్లలో లాంగ్ రన్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. నష్టాలు రావడంతో పుష్ప1 సినిమాకు నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇచ్చారు. అప్పటి టికెట్ ధరలు వేరు.. ఇప్పటి టికెట్ ధరలు వేరు.. పుష్ప1కు మించి డబుల్ రేంజ్ హిట్ అవడంతోపాటు ఆ స్థాయిలో కలెక్షన్లు రావాలి.. కుటుంబాలకు కటుంబాలు థియేటర్లకు తరలిరావాలి.. అలా వస్తేనే నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, అందులో క్యాంటిన్ నడిపేవారికి లాభాలు వస్తాయి. ఏం జరుగుతుందో చూద్దాం.












Click it and Unblock the Notifications