ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ నెల 19న విడుదలైన ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. గత ఏడాది వచ్చిన ధురంధర్ కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవిక కథనం, యాక్షన్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహేష్ బాబు సహా పలువురు టాలీవుడ్ హీరోలు ఈ సినిమాను ప్రశంసించారు.
తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. లార్జ్ స్కేల్ ఎమోషన్స్ తో తొలి పార్ట్ ను అధిగమించిన అరుదైన సీక్వెల్‌గా అభివర్ణించారు. ధురంధర్ 1 తనకు చాలా బాగా నచ్చిందని, దీని సీక్వెల్ 'ది రివెంజ్' దాని గొప్పతనాన్ని, అంతరాత్మను తొలి పార్ట్ కన్నా మించిపోయిందని వ్యాఖ్యానించారు. కథనం, నటీనటుల ఎంపిక, సంగీతం, సినిమాను తెరకెక్కించిన విధానం, సన్నివేశాల చిత్రీకరణపై దర్శకుడికి ఉన్న భావోద్వేగ పట్టుదలలే ఈ చిత్రానికి నిజమైన బలం అని తేల్చి చెప్పారు.

ఇలా అన్నీ సమకూరినప్పుడే ఉత్కంఠను కలిగించే కథ మలుపులను అల్లుతుందని, ధురంధర్ 2: ది రివెంజ్.. దీనికి అద్దం పట్టిందని అన్నారు. నాలుగు గంటల నిడివి గల చిత్రాన్ని రూపొందించి విడుదల చేసినందుకు రాజమౌళి దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సినిమా నిడివి ఎక్కువే అయినప్పటికీ చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోయేలా తీశారని ఆయన ప్రశంసించారు.
I loved Dhurandhar-1, but The Revenge surpassed the original in both scale and soul.
— rajamouli ss (@ssrajamouli) March 21, 2026
The writing, casting, technical execution, music, world design and direction are flawless…. But it’s the emotional stakes that really ground it.
The writing manages to weave plot twists that…
రణ్‌వీర్ సింగ్ నటనను రాజమౌళి మాస్టర్ క్లాస్ గా అభివర్ణించారు. షెడ్‌లో సోదరితో ఉన్న సన్నివేశం నటనకు ఓ పాఠం అని పేర్కొన్నారు. ఆరంభం నుండి క్లైమాక్స్ వరకు హమ్జా, జస్ కీరత్ పాత్రలలో రణ్ వీర్ సింగ్ తన నటనతో మంత్రముగ్ధులను చేశాడని అని కొనియాడారు. మరో కీలక పాత్ర పోషించిన ఆర్ మాధవన్.. ప్రేక్షకులను కథలోని భావోద్వేగ లోతులకు తీసుకెళ్లాడని అన్నారు. కొన్ని సన్నివేశాల్లో నిస్సహాయత, నిరాశను అద్భుతంగా పలికించాడని కీర్తించారు. ఈ అఖండ విజయానికి యావత్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా "ధురంధర్ 2: ది రివెంజ్"ను సినిమాటిక్ డిస్రప్టర్ గా కొనియాడారు. ఫార్ములా బేస్డ్ బాలీవుడ్ చిత్రాల శకం నుంచి ఇది ఒక కొత్త మార్పును సూచిస్తుందని, సంప్రదాయంగా హీరో చుట్టూ తిరిగే కథనాలకు ఈ సినిమా చెక్ పెట్టిందని చెప్పారు. అతినాటకీయత, నీరుగారిపోయిన కథలపై ఆధారపడే దర్శకులకు ఓ పీడకల అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. రక్తం కారకుండా, నొప్పి తెలియని హీరోలందరినీ చంపేసిందని స్పష్టం చేశారు.
-
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
రణవీర్ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
నవాజ్ షరీఫ్ నుంచి అజిత్ ధోవల్ దాకా.. ధురంధర్ 2లో ఎవరెవరు ఏ రోల్? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు












Click it and Unblock the Notifications