మహేష్‌బాబు సరసన హీరోయిన్‌ను ఎంపిక చేసిన రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్లు అవుతుందని అంచనా ఉంది. అందుకు తగ్గట్లుగానే సినిమాను భారతదేశంలోని పలు భాషలతోపాటు విదేశాలకు చెందిన ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. షూటింగ్ ప్రారంభం కానప్పటికీ ఈ చిత్రం బిజినెస్ పై ఇప్పటినుంచే అంచనాలు విపరీతంగా ఉన్నాయి.
కథకు, రామాయణానికి లింకు?
అటవీ నేపథ్యంలో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రాబోతోందంటున్నారు. తాజాగా మరో వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమా కథ కాశీ బ్యాక్ డ్రాప్ లో ప్రారంభమవుతుందని, మహేష్ బాబు శ్రీరాముడిగా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సినిమా కథకు, రామాయణానికి లింకు ఉంటుందంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేవారి గురించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. అయితే అవేవీ ఖరారు కాలేదు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది.

నవోమీ స్కాట్ పేరు ఖాయమేనా?
ది మార్షియన్, అల్లాదీన్, ఛార్లీస్ ఏంజెల్స్ సినిమాల్లో నటించిన నవోమీ స్కాట్ పేరు ఖాయమంటున్నారు. సినిమా కూడా హాలీవుడ్ స్థాయిలో తీయడంతోపాటు ఇంగ్లిషులో విడుదల చేయబోతున్నారు కాబట్టి హాలీవుడ్ కు చెందిన నటినే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. నవోమీస్కాట్ మహేష్ బాబు కాంబినేషన్ సూపర్ గా ఉంటుందని, ఇద్దరూ అందంలో ఒకర్నొకరు తీసిపోరని, కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలనే యోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత తమ హీరో కేవలం హాలీవుడ్ సినిమాలే చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు.












Click it and Unblock the Notifications