'వారణాసి' గురించి ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టిన రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. ఇక గతంలో రాజమౌళి సినిమా అంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది. కానీ ఈ సారి దర్శకధీరుడు రాజమౌళి మాత్రం పక్కా ప్లాన్ అనుకున్న తేదీకే వారణాసి మూవీని రిలీజ్ చేయాలని పక్కా ప్రణాళికలను సిద్దం చేశారు.

ఈ మేరకు ఇప్పటికే మూవీ ప్రొమోషన్స్ ను ప్రారంభించారు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక వారణాసి మూవీపై ఇటీవల అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. ఈ సినిమా గురించి అలాగే సూపర్ స్టార్ మహేష్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వారణాసి మూవీ ముందు చెప్పినట్లుగానే ఓ టైమ్ ట్రావెల్ మూవీ అని రాజమౌళి స్పష్టం చేశారు. అలాగే వారణాసి మూవీలో ఎమోషన్స్ కు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు. ఈ మూవీ ముందు నుంచీ చెప్పినట్లుగానే తండ్రీకొడుకుల ఎమోషన్స్ తో పాటు అమ్మాయి- అబ్బాయికి మధ్య ఉండే ఓ అందమైన లవ్ స్టోరీ అని రాజమౌళి కీలక విషయాలను వెల్లడించడం విశేషం. ఇక వారణాసి మూవీ.. ఆరు లేదా ఏడు సినిమాలను కలిపి ఒకే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంటుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

Rajamouli has revealed lesser-known details about the movie Varanasi the film release on April 7

వారణాసి మూవీపై రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక వారణాసి మూవీలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళీ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కుంభ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+