ఏపీకి వరుణుడి హెచ్చరిక.. నేడు ఈ జిల్లాలలో వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో నేడు అనేక ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సూచనల ప్రకారం నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురవొచ్చు.

ఏపీఎస్‌డీఎంఏ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని సూచించారు.

AP Rain Alert Several Districts to Receive Showers Today October 20 rain alert issued by imd

దక్షిణ తీర ప్రాంతాల్లో రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. కోస్తాంధ్రప్రదేశ్‌, యానాంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. రాయలసీమ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్టోబర్‌ 19 నుంచి 25 వరకు బలమైన గాలులతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.

ఈ వర్షాలు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, తేమతో కూడిన గాలుల వల్ల కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు వీచేటప్పుడు చెట్లు, ఎలక్ట్రిక్‌ పోల్స్‌, భారీ హోర్డింగ్‌లు, తుఫాను నీటి ప్రవాహాల దగ్గర నిలబడకూడదని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది.

పిల్లలను బయటకు పంపకుండా, వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. రైతులు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరింది.
అక్టోబర్‌ నెలలో సాధారణంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తీర జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. ఈసారి కూడా అదే తీరులో వర్షాలు కురుస్తున్నాయి.

కోల్‌ఇండియా తరహాలో సింగరేణి అధికారులకు దసరా ధమాకా!
కోల్‌ఇండియా తరహాలో సింగరేణి అధికారులకు దసరా ధమాకా!

రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నిండుతున్నాయి కాబట్టి రైతులకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు వాతావరణ శాఖ, ఏపీఎస్‌డీఎంఏ అందించే తాజా సమాచారాన్ని ఫాలో అవుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. రానున్న రెండు, మూడు రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+