రాజమౌళి - మహేష్‌బాబు సినిమాకు వారిద్దరి వాటా, ఒప్పందం ఏమిటో తెలుసా?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కబోతున్న చిత్రాన్ని ఎస్ఎస్ఎంబీ 28 పేరుతో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిరాడంబరంగా జరిగాయి. మీడియాకు విషయాన్ని తెలియజేస్తే అభిమానులు వస్తారు.. తొక్కిసలాటలుంటాయనే ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని చాలా సింపుల్ గా కానిచ్చేశారు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరానలు ఆయన బయటకు వెల్లడించనున్నారు.

ఇద్దరూ కలిపి తీసుకోవాలని..
ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. తనకు కావల్సిన విధంగా రాజమౌళి దీన్ని రచయిత, తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ చేత రాయించుకున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పారితోషికం కాకుండా మహేష్ బాబు, రాజమౌళికి ఒక అలవాటు ఉంది. సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు. రెమ్యునరేషన్ తగ్గించుకొని వీరిద్దరూ వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిపి 40 శాతం వాటా తీసుకోనున్నారు.

Rajamouli Mahesh Babu taking 40 percent stake in new film

డిస్నీ, సోనీలతో ఒప్పందం?
హాలీవుడ్ సినిమాలా రూపొందించి ప్రపంచస్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అందుకు డిస్నీ, సోనీ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయబోతున్నారు. ఇప్పటికే ఆయా సంస్థలతో చర్చలు పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచనగా ఉంది. ఈ రెండు సంస్థలైతే సినిమాను ప్రపంచవ్యాప్తంగా బాగా మార్కెటింగ్ చేస్తాయని రాజమౌళి భావిస్తున్నారు. అలాగే యార్లగడ్డ శోభును కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తీసుకోబోతున్నారు. బాహుబలి తీసిన శోభుకు అంతర్జాతీయ మార్కెటింగ్ చేయడంతోపాటు పరిచయాలు కూడా ఉండటంతో ఈ సినిమాకు బాగా ఉపయోగపడుతుందని దర్శక ధీరుడి ఆలోచన. ఈ విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి చేరబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+