పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి నెక్స్ట్ సినిమా..? దురంధర్ కు మించిన విధ్వంసం..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కలిసి 'వారణాసి' అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రం షూటింగ్ పూర్తి చేయనుంది. వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తికావొస్తున్న నేపథ్యంలో చిత్రంలోని క్యారెక్టర్స్ కు సంబంధించిన పోస్టర్స్ ను వారి బర్త్ డే కానుకగా విడుదల చేస్తుంది చిత్ర యూనిట్.
అందులో భాగంగానే ఇటీవల ఈ మూవీలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్ డే కానుకగా రెండు ఫోటోలను విడుదల చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇక ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే ఉంది. ఆ రోజున మహేశ్ బాబుకు సంబంధించిన గ్లింప్స్ ను మూవీ టీమ్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఇప్పుడు అందరినీ ఓ ప్రశ్న వెంటాడుతోంది. రాజమౌళి తర్వాతి చిత్రం ఏంటి..? అని.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో రాజమౌళి సినిమా అని ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటి అంటే..? పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి తన తదుపరి చేస్తారని తెలుస్తోంది.

ఇదివరకే ధురంధర్ సినిమా చూసిన రాజమౌళి.. తనకు అలాంటి స్క్రిప్ట్ రాయమని తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను అడిగారట. రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం ఇందుకు సంబంధించిన ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ను డెవలప్ చేస్తున్నారట.. మరి ఇందుకు సంబంధించిన విషయాలు మున్ముందు వెల్లడికానున్నాయి. మరి ఈ సినిమాలో హీరో ఎవరు..? కథ ఏంటి..? అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications