రజినీకాంత్ జైలర్ మరో వండర్.. వరల్డ్ వైడ్ గా టాప్ ట్రెండింగ్!!
సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీశారు. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ గతానికి భిన్నంగా డీసెంట్ క్లాస్ యాక్షన్ లో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.
జైలర్ గా రజినీకాంత్, ఆయన సరసన రమ్యకృష్ణ, నటులు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, తమన్నా, సునీల్ ఎవరికి వారే సినిమాకి ప్లస్ గా నిలిచారు. థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్ల సునామి సృష్టించింది.

ఇక థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజులైనా కాకముందే ఓ టి టి లో కూడా రిలీజ్ అయింది. ఓ టి టి లో విడుదలైన కొద్ది గంటల్లోనే జైలర్ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలువగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా ఓటీటీ లో ట్రెండ్ అవుతుంది.బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఈ సినిమా ఓటీటీ లో కూడా దుమ్ము రేపుతోంది.
ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ లు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ లో విడుదలై తన జోరుని కొనసాగిస్తోంది. మొత్తం 36 దేశాలలో ఈ సినిమా ట్రెండింగ్లో నిలిచిందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా, ఓ టి టి లో కూడా రికార్డు సృష్టించిన ఈ సినిమా ఊహించిన దాని కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో తీసిన ఘనత నెల్సన్ దిలీప్ కుమార్ కే దక్కింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తో పాటు హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా తలైవా రజనీకాంత్ కు మంచి పేరు తీసుకువచ్చింది.












Click it and Unblock the Notifications