డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి.. వీడియో వైరల్ !!
'రాజు వెడ్స్ రాంబాయి'.. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. యువ జంట అఖిల్ రాజ్ - తేజస్విని రావు జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించారు. శివాజీ రాజా, అనిత చౌదరి, చైతూ జొన్నలగడ్డ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఖమ్మం-వరంగల్ సరిహద్దులోని ఓ గ్రామంలో 2004లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
హల్ చల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు డెలివరీ బాయ్ పొరపాటున రాంగ్ అడ్రస్‌కు పార్సిల్ తీసుకువచిన్నట్టు తెలుస్తోంది. అందుకు క్షమాపణలు కోరినప్పటికీ.. అఖిల్ రాజ్, అతని కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని వాపోతున్నాడు. హీరో కొట్టడానికి వచ్చాడని.. అతని తల్లి తన ముఖంపై ఉమ్మివేసి అవమానించిందని డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న డెలివరీ బాయ్ వైపు హీరో కోపంతో దూసుకురావడం.. అతనిని కొట్టడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు సదరు హీరో ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. డెలివరీ బాయ్స్ పట్ల అలాంటి వైఖరి తగదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం కేవలం డెలివరీ బాయ్ వైపు ఉన్న వీడియో మాత్రమే బయటకు వచ్చినందున.. అసలు గొడవకు దారితీసిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హీరో అఖిల్ రాజ్ లేదా అతని కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది.
అఖిల్ రాజ్ కెరీర్..
అఖిల్ రాజ్ ముందుగా మీడియాలో యాంకర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 'సఖియా', 'ఏవండోయ్ ఓనర్ గారు' వంటి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన 'విందు భోజనం' అనే సినిమాతో మెప్పించారు. ఇక 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆయన చేతిలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'స్మాల్ టౌన్ బాయ్స్' చిత్రంలో నటిస్తున్నారు.
Reyy entra e Attitude 😱👀
— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) June 29, 2026
Raju weds rambai movie hero Akhilhttps://t.co/HDbJC7oa7Q












Click it and Unblock the Notifications