'గేమ్ ఛేంజర్' కథ ముగిసింది..బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫ్లాప్‌గా..!
RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం..'గేమ్ ఛేంజర్'.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు.
సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపించాయి.ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చేలరేగింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు రూ.100 కోట్లకుపైగానే తేడా కనిపించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో , నిర్మాతలు వెనక్కి తగ్గారు. 'గేమ్ ఛేంజర్' రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు.

సినిమా కలెక్షన్లు ఫేక్ అని దిల్ రాజు సైతం తెలిపారు.ఇదిలా ఈ సినిమాపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం అయింది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్' కథ ముగిసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 195 కోట్లు వసూలు చేసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్'ను నిర్మించారు. ఫలితంగా రూ.155 కోట్ల నష్టాన్ని ఈ సినిమా మిగిల్చింది. దీంతో "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications