మరోసారి ముంబై అండర్‌వరల్డ్‌లోకి రామ్ గోపాల్ వర్మ!
భారత చలన చిత్ర పరిశ్రమలో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలకు సరికొత్త అర్థం చెప్పిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మార్క్ క్రైమ్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆర్జీవీ తన రాబోయే కొత్త సినిమా 'పోలీస్ కంపెనీ'ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గతంలో 'సత్య', 'కంపెనీ' వంటి ఐకానిక్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. చాలా కాలం తర్వాత మళ్లీ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
దయా నాయక్ పాత్ర హర్షవర్ధర్ రాణే
ఈ సినిమాలో హీరో హర్షవర్దన్ రాణే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ హర్షవర్ధన్ రాణేకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను పంచుకున్నాడు. ఈ చిత్రం కాన్సెప్ట్ గురించి చెబుతూ.. "పోలీస్ అనేది ఓ ప్రభుత్వ వ్యవస్థ.. అండర్ వరల్డ్ అనేది డబ్బు సంపాదించే ఓ కంపెనీ. అయితే ఒక వ్యవస్థకు అదనపు అధికారులు ఇచ్చినప్పుడు అది ఓ కంపెనీలా ఎలా మారుతుందనేదే ఈ సినిమా స్టోరీ" అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. 'డి కంపెనీ' కంటే ఈ 'పోలీస్ కంపెనీ' చాలా ప్రమాదకరమైనదని ఆర్జీవీ కామెంట్లు చేశారు.

కథా నేపథ్యం.. నిజ జీవిత సంఘటనలు
దావూద్ ఇబ్రహీం ముంబైలోని తన ప్రత్యర్థి ముఠాలను అంతం చేసి, తన గ్యాంగ్‌ను ఓ 'కంపెనీ'గా మార్చి దుబాయ్ కి పారిపోయిన తర్వాతి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ సమయంలో నేర కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను చోటా రాజన్‌కు అప్పగించగా.. తదనంతర కాలంలో దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌ల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ముంబై అండర్ వరల్డ్ లో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి యూపీ, బీహార్ వంటి ప్రాంతాల నుంచి ఎందరో యువకులు నేర ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
My NEXT film’s NAME being produced by T SERIES is ..
— Ram Gopal Varma (@RGVzoomin) August 10, 2026
POLICE COMPANY
With the tag line
“It Is More Dangerous Than D Company “
The police is an institution, and an underworld company is a money making organisation..
But when an institution is given extra powers, it…
300 ఎన్‌కౌంటర్లు.. ప్రత్యేక ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుల బృందం
ముంబైలో ముఠా కక్షలు, నేరాలు పతాక స్థాయికి చేరినప్పుడు ముంబై పోలీసులు ఓ ప్రత్యేక ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం 1997 నుంచి 2004 మధ్య కాలంలో దాదాపు 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్లలో హతమార్చింది. ఆ ప్రత్యేక బృందంలో కీలక సభ్యుడైన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ నిజ జీవిత సంఘటనలు, అనుభవాల ఆధారంగానే ఈ 'పోలీస్ కంపెనీ' సినిమాను రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్నారు.
3 more pics of HARSHVARDHAN RANE as DAYA NAYAK in POLICE COMPANY pic.twitter.com/PKqn5BNFi6
— Ram Gopal Varma (@RGVzoomin) August 10, 2026
క్రైమ్ డ్రామా చిత్రాలకు రీ-ఎంట్రీ
ఆధునిక బాలీవుడ్‌లోని అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ,.. ముఖ్యంగా ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే 'సత్య' (1998), 'కంపెనీ' (2002) వంటి క్రైమ్ డ్రామాలతో దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన మళ్లీ క్రైమ్ చిత్రాల ప్రపంచంలోకి తిరిగి వచ్చారు, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.














Click it and Unblock the Notifications