హీరో నేనే.. డైరెక్టర్ నేనే.. నిర్మాత కూడా నేనే అంటున్న యంగ్ హీరో !!!
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తనదైన ఎనర్జీ, డ్యాన్స్‌లు, మాస్ యాటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే.. మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు.
'దేవదాసు' సినిమాతో హీరోగా పరిచయమైన రామ్, 'రెడీ', 'కందిరీగ', 'నేను శైలజ', 'హలో గురు ప్రేమ కోసమే', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలతో మాస్, యూత్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గతేడాది "డబుల్ ఇస్మార్ట్" తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. అయితే హీరో రామ్ పోతినేని ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. నటుడిగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా మారి అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన RAPO23 ప్రాజెక్ట్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

తన 23వ చిత్రమైన RAPO23కు రామ్ స్వయంగా దర్శకత్వం వహించనుండటం విశేషం. అంతేకాదు, ఈ చిత్ర కథను కూడా ఆయనే సిద్ధం చేయడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ఒక ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇందులో రామ్ 'వీర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ లెదర్ జాకెట్ ధరించి, రఫ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. పోస్టర్‌లోని డార్క్ టోన్, ఆయన కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
"A Lone Wolf's Tale" అనే ట్యాగ్‌లైన్ ఈ కథలో హీరో పాత్ర ఎంత ఒంటరి, ప్రమాదకరమైన మిషన్‌లో ఉంటుందో సూచిస్తోంది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, పూర్తిగా కొత్త జానర్‌లో రామ్ కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్టార్ హీరోలు దర్శకులుగా మారడం సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ 'జానీ'తో, విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్'తో, అడివి శేష్ 'కర్మ'తో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అలాగే తమిళంలో ధనుష్ 'పా పాండి', 'రాయన్' సినిమాలతో దర్శకుడిగా మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో రామ్ కూడా అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, రామ్ ఈ కథపై చాలా కాలంగా వర్క్ చేస్తున్నారట. యాక్షన్, సైకాలజికల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కలగలిపి పూర్తి భిన్నమైన అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ పాత్ర గతంలో ఆయన చేసిన పాత్రలకంటే చాలా డార్క్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతుందట. 'రాపో సినిమాటిక్స్' బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది.
An exciting journey begins with all your love & blessings. 🖤
— RAm POthineni (@ramsayz) May 15, 2026
Introducing "𝙑𝙀𝙀𝙍𝘼" in #RAPO23 🔥
-the story of a Lone Wolf. 🐺
Genre: Psychological Action Thriller.
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.
December 2026… pic.twitter.com/m9dkC0XMb7
అయితే హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రామ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడిగా రెండు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో మాస్ హిట్స్ అందించిన రామ్ పోతినేని, ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications