రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
ఈ మేరకు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో నటించింది. ఇక ఈ మూవీలో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నారు. ఈ మేరకు దసరా పండగ నుంచి ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.
On the auspicious occasion of Navratri, we celebrate the beginning of a new era. Yeh Ram ke Yug ka Aarambh hai. 🏹Namit Malhotra’s Ramayana Part 1: In cinemas WORLDWIDE, across all premium formats, from 5th November.Advance bookings open on Dussehra. https://t.co/pKLvArFQCg
— The World Of Ramayana (@WorldOfRamayana) October 11, 2026
ఈ రామాయణ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అలాగే యష్ కు చెందిన మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాయణ తొలి పార్ట్ మొదటి 2026లో రానుండగా.. రామాయణ పార్ట్ 2 ను 2027 దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే రామాయణ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయనతోపాటు హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డీఎన్ ఈజీ అనే సంస్థ దీనికి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే దంగల్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీష్ తివారీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications
