10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!

సీక్వెన్స్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. అలాంటి సినిమానే దృశ్యం.. మలయాళంలో మొదటగా స్టార్ట్ అయి అక్కడ అద్భుత విజయం సాధించి ఆ తర్వాత తెలుగు.. తమిళం.. హిందీలో రీమేక్ అయింది ఈ మూవీ ఫ్రాంచైజ్. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ లో ఇది ఓ సంచలనం అని చెప్పొచ్చు. అనుకోకుండా చిక్కుల్లో పడిన ఓ సామాన్య కుటుంబం.. ఆ సమస్యల నుంచి బయట పడేందుకు ఏం చేసింది అనేదే స్టోరీ లైన్ తో 2013 లో దృశ్యం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2021 లో దృశ్యం 2 మూవీ తెరకెక్కింది. పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ఏడాది దృశ్యం 3 మూవీ రిలీజ్ అయింది. అది కూడా హిట్ అయింది.

అయితే మలయాళం ఈ ఏడాది మే లో దృశ్యం 3 రిలీజ్ అయింది. కానీ ఆ మూవీతో ఈ స్టోరీకి ఎలాంటి శుభం కార్డు పడలేదు. ఇంకా సస్పెన్స్ ను అలాగే కొనసాగించి దృశ్యం 4 ఉన్నట్లు హింట్ ఇచ్చాడు దర్శకుడు జీతూ జోసెఫ్. కానీ ఇదే మూవీ దృశ్యం 3 ది కంక్లూజన్ పేరుతో హిందీలో తాజాగా రిలీజైంది. ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, శ్రియ ప్రధాన పాత్రలుగా నటించారు. మలయాళం దృశ్యం 3 మూవీకి భిన్నంగా ఒరిజినల్ స్టోరి, స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని అభిషేక్ పాథక్ రూపొందించారు. దృశ్యం సిరీస్ లో ఈ మూవీ చివరిది కావడంతో సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 500 కోట్ల వరకు కలెక్షన్స్ రావడం సంచలనం అనే చెప్పాలి.

Drishyam3 movie nears the 500 crore mark in just 10 days this is what box office rampage looks like

దృశ్యం 3 మూవీ రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. తొలి వారం ముగిసేసరికి ఇండియాలోనే రూ. 245.50 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. వీకెండ్స్ తర్వాత వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్లు తగ్గకపోవడం విశేషం. అలా సెకండ్ వీకెంట్ నాటికి ఈ మూవీ ఏకంగా రూ. 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ఇక సెలవుల సీజన్ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డుల్ని కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దృశ్యం 3 సినిమాలో టబు, ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. స్టార్ స్టూడియో 18, పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+