నాడు కరుణానిధి, జయలలిత.. నేడు విజయ్: తమిళనాడు మార్పులకు అతీతం: ప్రధాని మోదీ

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ముఖ్యమంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమలు చేస్తోన్న మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్.. వంటి కార్యక్రమాలు తమిళనాడులోని తయారీ రంగానికి ఎంతో మేలు చేస్తోన్నాయని, స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తోన్నాయని అన్నారు. తమిళనాడు.. భారత్ కు ప్రధాన గ్రోత్ ఇంజిన్ గా ఉంటోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన చెన్నైలో పర్యటిస్తోన్నారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి విజయ్.. సాదరంగా ఆయనను ఆహ్వానించారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. వీటిల్లో మెట్రో రైల్ ఫేస్ 2 విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, నగరాభివృద్ధిని వేగవంతం చేయడం వంటివి ఉన్నాయి.

Working With Legends Karunanidhi Jayalalitha Now Building the Future with CM Vijay says PM Modi

ఈ సందర్భంగా ఏర్పాటు బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేయాలంటే ముందుగా రాష్ట్రాలను ఆర్థికంగా పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా తమిళనాడు సమగ్ర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల తమకు ఉన్న ప్రాథమిక సంకల్పం ఎప్పటికీ మారదని పునరుద్ఘాటించారు.

పట్టణాభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సురక్షిత, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ప్రజల రోజువారీ జీవన సౌలభ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. ఆధునిక రవాణా మౌలిక వసతుల కల్పన ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివసించే పౌరుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని, ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను కేంద్రం అందిస్తుందని ఆయన తెలిపారు.

Working With Legends Karunanidhi Jayalalitha Now Building the Future with CM Vijay says PM Modi

తయారీ రంగంలో దేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధి ఫలితంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధాని వివరించారు. దేశ పారిశ్రామిక వృద్ధిలో తమిళనాడు పోషించిన పాత్ర ఎంతో అభినందనీయమని కొనియాడారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం ద్వారా రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య తగ్గడమే కాకుండా, సమగ్ర ఆర్థిక వికాసానికి బలమైన బాటలు పడతాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

గోదావరి-కావేరి నదుల లింకేజీ, హోసూర్- బెంగళూరు మెట్రో రైల్: ప్రధాని మోదీకి విజయ్ ప్రతిపాదనలు
గోదావరి-కావేరి నదుల లింకేజీ, హోసూర్- బెంగళూరు మెట్రో రైల్: ప్రధాని మోదీకి విజయ్ ప్రతిపాదనలు

గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం నుంచే తమిళనాడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందనే విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎం కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతలతో భేటీ అయ్యే అవకాశాలు లభించాయని చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జయలలిత, పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, ఎంకే స్టాలిన్‌ వంటి నాయకులతో కలిసి రాష్ట్ర పురోగతి కోసం పనిచేసినట్లు తెలిపారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఇక చెన్నై వడపళని వరకూ మెట్రో రైల్: విజయ్ తో కలిసి ప్రారంభించిన ప్రధాని మోదీ: రైలు ప్రయాణం
ఇక చెన్నై వడపళని వరకూ మెట్రో రైల్: విజయ్ తో కలిసి ప్రారంభించిన ప్రధాని మోదీ: రైలు ప్రయాణం

ముఖ్యమంత్రులుగా ఎవరొచ్చినా, నూతన ప్రభుత్వాలు ఏర్పాటైనా సహకార సమాఖ్య భావనకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతులను విస్తరించడం, యువతకు కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా తమిళనాడు సంక్షేమ ప్రయాణాన్ని నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+