ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జిబౌటిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 109 మంది కార్మికులు మృతి చెందారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 305 మంది ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(IOM) అనే సంస్థ పేర్కొంది. ఈ పడవ జిబౌటీ నుంచి యెమెన్ కు ప్రయాణిస్తుండగా గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ అంచనా వేస్తోంది. ఇక మృతుల్లో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, అలాగే 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది.
ఈ ప్రమాదం నుంచి దాదాపు 80 మంది వరకు ప్రాణాలతో బయటపడగా మరో 116 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యల్ని అధికారులు ముమ్మరం చేశారు. ఇక ఈ ఘటనపై పలు అంతర్జాతీయ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలువబడే ప్రాంతం నుంచి నిత్యం వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు ప్రయాణిస్తుంటారు. జిబౌటీ నుంచి బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి గుండా వారు గల్ఫ్ దేశాలకు చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పడవ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందుతోంది. అయితే యెమెన్ లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ఉపాధి అవకాశాల కోసం ఆ దేశానికి వేలాదిగా తరలివెళ్తున్నారు.

ఈ ఘటనపై IOM చీఫ్ ఆఫ్ మిషన్ ఇన్ జిబౌటీ అలెగ్జాండ్రె కోయ్సాక్ మాట్లాడుతూ ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. జీవనోపాధి కోసం వలసదారులు ఎదుర్కొంటున్న ప్రమాదాలకు ఈ విషాదకరమైన ఘటన ఒక స్పష్టమైన మచ్చగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఈస్ట్రర్న్ రూట్ మోస్ట్ డేంజరస్ గా మారిందని కొందరు కాలి నడకతో మండే ఎండలో వందల కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కోల్పోతున్నారని.. మరికొందరు ఇలా బోటు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications
