Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్స్- ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది కింగ్డమ్ మూవీతో అలరించిన విజయ్.. ఈ ఏడాది 'రణబాలి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. విజయ్- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో గతంలో వచ్చిన టాక్సీవాలా మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
దాంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక రణబాలి మూవీలో విజయ్ సరసన ఆయన సతీమణి రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇక తాజాగా రణబాలి మూవీ సెన్సార్ బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. దాంతో ఈ మూవీని కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఆస్వాదించవచ్చని సెన్సార్ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని తెలుస్తోంది. అంటే రణబాలి మూవీ దాదాపు 3 గంటలు ఉన్నట్లు సమాచారం. అంతేకాక సెన్సార్ బోర్డు నుంచి ఈ మూవీకి ఎవరూ ఊహించని విధంగా జీరో కట్స్ తో క్లియరెన్స్ ఇచ్చింది.
దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఒకవిధంగా చెప్పాలంటే రణబాలి విషయంలో సెన్సార్ బోర్డు వర్గాలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పీరియాడిక్ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, పోరాట సన్నివేశాలు ఉన్నప్పటికీ.. కథకు తగినట్లుగా ఎక్కడా మితిమీరిన హింస లేకుండా చాలా జాగ్రత్తగా దర్శకుడు తెరకెక్కిన విధానాన్ని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు సమాచారం. మొత్తానికి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూను బట్టి సినిమా బ్లాక్ బస్టర్ అని తెలుస్తోంది.

ఇక రణబాలి మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఈ కథ 1854 నుంచి 1878 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన కరవు నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలో రాయలసీమను పరిపాలించిన బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, ఆకృత్యాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించినట్లు సమాచారం. అసాధారణ కరవు కారణంగా తిండిగింజలు కూడా దొరకని గడ్డు కాలంలో తెల్లదొరలు విధించిన అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా.. నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఓ స్థానిక యోధుడి చారిత్రక గాథే రణబాలి అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
