ప్రేమించిన యువకుడి కోసం రష్యా నుంచి బిహార్ కు.. హద్దులు దాటిన ప్రేమ..
ప్రేమ అనేది ఎవ్వరికీ అర్థం కాని సబ్జెక్ట్.. అది ఎవరికి, ఎవరిపై, ఎప్పుడు కలుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమించడానికి కారణం ఏంటి..? అంటే ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. అయితే ఇలా ఎందుకు అంటారో ఈ ఘటన చూస్తే నిజంగానే అర్థం అవుతుంది. ప్రేమకు హద్దులు- సరిహద్దులు ఉండవని తాజాగా వెల్లడైంది. ఎక్కడో రష్యాలో ఉన్న ఓ యువతి.. భారత్ లోని బిహార్ కు చెందిన ఓ యువకుడి కోసం వచ్చింది. ఇదంతా ప్రేమతోనే సాధ్యం అయింది. నవభారత్ అనే మీడియా కథనం ప్రకారం.. బిహార్ లోని భాగల్ పూర్ కు చెందిన రాహుల్ యాదవ్ అనే యువకుడు ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లాడు. అక్కడ జూలీ అనే యువతితో రాహుల్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.

అయితే ఆ తర్వాత కొంతకాలానికి రాహుల్ రష్యా నుండి తిరిగి స్వదేశానికి వచ్చాడు. అయినా వాళ్లిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా వాళ్లు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో తన తల్లిదండ్రులతో కలిసి జూలీ బిహార్ భాగల్ పూర్ లోని రాహుల్ ఇంటికి చేరుకుంది. ఇది చూసిన గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూలీ బంధువుల్ని రాహుల్ బంధువులు కలిసి మాట్లాడుకున్నారు. అలా ఇరు కుటుంబాలు ఈ వివాహానికి అంగీకారం తెలిపాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్- జూలీల వివాహం వచ్చే నవంబర్ లో జరగనుంది. అయితే తమ వివాహం జరిగిన తర్వాత ఎక్కడ కాపురం పెట్టాలన్నదానిపై రాహుల్- జూలీ ఇద్దరూ చర్చించుకున్నారు.
ఈ క్రమంలో తమ కుటుంబం ఓ చిన్న గుడిసెలోనే నివాసం ఉంటుందని రాహుల్.. జూలీతో వివరించాడు. అయితే రాహుల్ తో కలిసి అదే గుడిసెలో ఉండేందుకు జూలీ కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఇరువురి లవ్ స్టోరీ స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు జూలీ- రాహుల్ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
