ఛీ .. ఛీ .. ఇదేం దరిద్రం.. రీల్స్ కోసం కపుల్స్ గా మారిన తల్లీకొడుకులు..!
ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్ని విపరీతంగా వినియోగిస్తున్నారు. సరదాగా టైమ్ పాస్ కు కొంత మంది నెట్టింట అధిక సమయాన్ని గడుపుతుంటే మరికొంతమంది రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఒక్క రీల్ తో ఫేమస్ అయిపోవాలని భారీగా లైక్స్, కామెంట్స్ రావాలని వాళ్లు ఎంతదూరం వెళ్లడానికైనా.. ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడం కోసం ప్రమాదకరమైన స్టంట్స్ తో ఇతర వింతలు, విన్యాసాలు చేస్తూ శ్రమిస్తున్నవారు కొందరు ఉంటే మరి కొందరు మాత్రం బరితెగించి ఏకంగా తమ బాడీని చూపిస్తూ అసభ్యకరంగా డ్యాన్సులు వేస్తూ పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలో తల్లికొడుకులు, తండ్రికూతుళ్లు కూడా వరసలు మరిచి పిచ్చిగా ప్రవరిస్తున్నారు.
అయితే దిల్లీకి చెందిన రచన(40) అనే మహిళ తన కన్నకొడుకుతోనే కపుల్స్ రీల్స్ చేస్తూ సభ్య సమాజం తలవంచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు లైక్స్ కోసం తల్లీ కొడుకుల పవిత్ర బంధాన్ని నాశనం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మానవ సంబంధాలను ఇలా మార్కెట్ వస్తువుగా మార్చకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మన భారతీయ సంస్కృతికి అవమానకరం అని.. దయచేసి ఇలాంటివి ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక రచన అనే మహిళ ఇన్ స్టా గ్రామ్ లో Santoor Mamma అనే పేరుతో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ను దాదాపు 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఆమె తన 20 ఏళ్ల కుమారుడితో గత కొంత కాలంగా చేస్తున్న రీల్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తన భర్తతో చేయాల్సిన రీల్స్ ను కుమారుడితో చేస్తూ లైక్స్, ఫేమస్ కోసం పాకులాడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కోసం ఏ సంబంధాన్ని కూడా కంటెంట్ గా మారుస్తారా..? అంటూ ఫైర్ అవుతున్నారు. లైక్స్ అండ్ వ్యూస్ మీకు తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తాయామో కానీ.. ఒక్కసారి కెమెరా ఆఫ్ అయ్యాక రిలేషనషిప్స్ మాత్రమే మిగులుతాయి అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి విషయం వైరల్ గా వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని మానవ సంబాధాలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications
