పులివెందుల వైసీపీ అభ్యర్ధి ఖరారు- కూటమి 'బిగ్' స్కెచ్, జగన్ అనూహ్య ఎంపిక..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. గత రెండు నెలల కాలంగా ఈ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్ధుల ఎంపిక పైనా ఫోకస్ చేసారు. పులివెందులలో ఏకగ్రీవం చేసిన జగన్ కు షాక్ ఇవ్వాలని టీడీపీ వ్యూహాలు సిద్దం చేస్తున్న వేళ..జగన్ అనూహ్యంగా అభ్యర్ధిని ఎంపిక చేసారు. దీంతో.. పులివెందుల కేంద్రంగా పోటీ ఆసక్తిగా మారుతోంది.

ఏపీలో స్థానిక ఎన్నికలు కూటమి- వైసీపీ మధ్య హోరా హోరీగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. దీని కోసం కొత్త వ్యూహాలను సిద్దం చేసుకుంది. పులివెందుల మహిళకు రిజర్వ్ అయింది. జగన్ సీఎం గా ఉన్న సమయంలో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇప్పుడు పులివెందులలో గెలిచి బదులు తీర్చుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఎక్కడైనా పోటీ జరగకుంటే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ కు సీటు ఉండదని జగన్ తేల్చి చెప్పారు. దీంతో.. పులివెందులలో ఏకగ్రీవం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. వీటిని గుర్తించిన జగన్ పులివెందుల మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్దిగా అనూహ్య ఎంపిక చేసారు. పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ వైసీపీ అభ్యర్థిగా వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి వైఎస్ ప్రమీలమ్మ పేరును జగన్ అధికారికంగా ప్రకటించారు.

రిజర్వేషన్లతో మారిన జనసేన సీట్ల లెక్కలు - తేల్చేసిన చంద్రబాబు, పవన్ వద్దకు పల్లా..!!
రిజర్వేషన్లతో మారిన జనసేన సీట్ల లెక్కలు - తేల్చేసిన చంద్రబాబు, పవన్ వద్దకు పల్లా..!!
ysrcp-names-ys-prameelamma-as-pulivendula-municipal-chairperson-candidate-here-the-details

టీడీపీ కి ప్రతిష్ఠాత్మకంగా.. బిగ్ ఫైట్

టీడీపీ నేతలు పులివెందులలో మున్సిపాల్టీతో సహా జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేయాలనే వ్యూహాల తో సిద్దం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో.. ఇక్కడ ప్రత్యేకంగా అవినాశ్ కు బాధ్యతలను జగన్ కేటాయించారు. కూటమి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండేందుకు వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి వైఎస్ ప్రమీలమ్మ ను జగన బరిలోకి దింపారు. మనోహర్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి.. జగన్‌కు బాబాయ్ వరుసవుతారు. అటు జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి వైపు నుంచి కూడా వీరికి బలమైన కుటుంబ బంధుత్వం ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా పులివెందుల స్థానిక రాజకీయాల్లో మనోహర్ రెడ్డి కీలకంగా ఉన్నారు. గతంలోనూ వైఎస్ ప్రమీలమ్మ పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. టీడీపీ నుంచి మహిళా నేత బరిలోకి దిగనున్నారు. ఇప్పుడు ప్రమీలమ్మ వైసీపీ నుంచి పోటీకి దిగటంతో.. టీడీపీ ఎవరికి అవకాశం ఇస్తుందీ... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. తుది ఫలితం ఏంటనేది ఆసక్తి గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+