శ్రీశైలం జలాశయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. దేశంలో తొలి ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అరుదైన రికార్డ్ ను నమోదు చేసుకుంది. ఏపీలో ఉన్న శ్రీశైలం జలాశయం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా ఇది నిలిచింది. అసాధారణమైన ఇంజనీరింగ్ లక్షణాలు, భారీ వరదలను తట్టుకునే సామర్థ్యం కారణంగా లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ గుర్తింపు ఇచ్చింది.

కృష్ణా నదిపై నిర్మించిన ఈ జలాశయం నిర్మాణం 1960లో ప్రారంభమై 1980లో పూర్తయింది. సముద్ర మట్టానికి సుమారు 980 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డ్యామ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ప్రజల సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తోంది. దక్షిణాసియాలో మరే ప్రాజెక్టులోనూ లేని విధంగా 60x55 అడుగుల భారీ క్రెస్ట్ గేట్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి డ్యామ్ యొక్క ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

Srisailam Dam Enters World Book of Records - First Project in India to Achieve This special Honour

2009లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల్లో రికార్డు స్థాయిలో 2.54 మిలియన్ క్యూసెక్కుల ప్రవాహాన్ని ఈ జలాశయం ధైర్యంగా తట్టుకుంది. ఆ సమయంలోనూ డ్యామ్ దృఢంగా నిలిచి రాష్ట్రాలకు రక్షణ కల్పించింది. ఈ దృఢత్వం, నిర్మాణ శైలి, హైడ్రో పవర్ ఉత్పత్తి విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించి సర్టిఫికెట్ అందజేసింది.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ సదరన్ రీజియన్ ఎలియేజర్ చేతుల మీదుగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. శ్రీశైలం జలాశయం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఈ ఘనతను ప్రస్తావిస్తూ, దేశంలో తొలిసారి ఇలాంటి గుర్తింపు ఒక ప్రాజెక్టుకు దక్కిందని తెలిపారు. ఆనాటి ఇంజనీర్ల కృషిని, ప్రస్తుత ఇరిగేషన్ అధికారుల కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు.

సింహాలతో సింహంలా సీతక్క.. వీడియో వైరల్!
సింహాలతో సింహంలా సీతక్క.. వీడియో వైరల్!

శ్రీశైలం జలాశయం కేవలం నీటి నిల్వ కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీరు, విద్యుత్ అందించే కీలక ప్రాజెక్టుగా శ్రీశైలం ప్రాజెక్ట్ నిలిచింది. శ్రీశైలం దేవాలయం సమీపంలో ఉండటం వల్ల దీనికి పర్యాటక ప్రాధాన్యత కూడా ఉంది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో నీటిమట్టం తగ్గుతున్నా, ఈ డ్యామ్ చరిత్రలో అనేకసార్లు కష్టాలను అధిగమించి నిలిచింది. ఈ గుర్తింపు శ్రీశైలం జలాశయ నిర్మాణంలో పాలుపంచుకున్న అందరి కృషికి సాక్ష్యంగా నిలుస్తుంది. భారతదేశ ఇంజనీరింగ్ చరిత్రలో మరో మైలురాయిగా శ్రీశైలం ప్రాజెక్ట్ అరుదైన రికార్డ్ ను నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+