కేంద్రం ప్లాన్ అదే- ఉచ్చులో పడొద్దు..- ఇండియా కూటమికి దిప్కే కీలక సూచన..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో ఒకే సారి ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ది సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. దీంతో కేంద్రం, పోలీసులతో పాటు నిరసనకారులు కూడా కాస్త గందరగోళానికి గురవుతున్నారు. అదే సమయంలో కేంద్రం కూడా వీరిలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోంది. తద్వారా వీరిలో చీలిక తీసుకురావాలనే వ్యూహం అమలుచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల వైఖరిపై కాక్రోచ్ జనతా పార్టీ ఛీఫ్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు.

ఢిల్లీలో లెక్కలు తప్పుతున్నాయా ? 27వేల CAPF జవాన్లపై కేంద్రానికి పోలీసుల రిక్వెస్ట్..!
ఢిల్లీలో లెక్కలు తప్పుతున్నాయా ? 27వేల CAPF జవాన్లపై కేంద్రానికి పోలీసుల రిక్వెస్ట్..!

సీజేపీకి నిరసన తెలిపేందుకు అనుమతి లభించినప్పుడు, మమ్మల్ని బీజేపీయే రంగంలోకి దించిందని చాలామంది వెంటనే కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేశారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. నిన్న ఇండియా కూటమి భారీ నిరసన చేపట్టింది, కానీ అక్టోబర్ 10న జరిగిన తరహాలో అణచివేత జరగలేదన్నారు. ప్రభుత్వం మనల్ని ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టేది సరిగ్గా ఇలాగే అని తెలిపారు. వేర్వేరు నిరసనలను వేర్వేరుగా చూడటం ద్వారా, చివరికి ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న ప్రజలలో వారు అనుమానాన్ని, అపనమ్మకాన్ని సృష్టిస్తారని దిప్కే తెలిపారు.

Abhijeet Dipke Alleges Different Treatment of CJP INDIA Bloc Protests to Create Mistrust

Catch 22: ఢిల్లీ నిరసనలతో బీజేపీ క్యాచ్ 22లో చిక్కుకుందా ? ఏంటీ ఎఫెక్ట్..?
Catch 22: ఢిల్లీ నిరసనలతో బీజేపీ క్యాచ్ 22లో చిక్కుకుందా ? ఏంటీ ఎఫెక్ట్..?

ప్రతిఒక్కరూ ఈ ఎత్తుగడలను గ్రహించాలని తన ఏకైక అభ్యర్థన అని దిప్కే తెలిపారు. ఈరోజు వారు ఒక నిరసనకు అనుమతి ఇచ్చి, మరొకదాన్ని అణచివేయవచ్చని, రేపు, వారు పాత్రలను తారుమారు చేయవచ్చన్నారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే బదులు, మనం ఒకరినొకరు అనుమానించేలా చేయడమే వారి ఉద్దేశమన్నారు. కుట్ర సిద్ధాంతాలు మనల్ని విభజించనివ్వవద్దని దిప్కే కోరారు. మనం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయంలో, మనలో మనం పోరాడుకునే ఉచ్చులో పడవద్దని సూచించారు. ఈ పోరాటం జ్ఞానేష్ కుమార్ , అతన్ని రక్షిస్తున్న వారికి వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఢిల్లీ నిరసనల్లో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు పాల్గొనేందుకు వస్తుండగా విమానంలోనే అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. నిన్న ఇండియా కూటమి నేతల్ని రోడ్డుపై భారీ ర్యాలీ తీసేందుకు అనుమతించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే దిప్కే ఈ వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+