విజయ్ దేవరకొండ‌పై ఎందుకింత నెగెటివిటీ? రణబాలి నిర్మాత ఫైర్!

Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌లో విజయ్‌ను మునుపెన్నడూ చూడని రా అండ్ రగ్గడ్ లుక్‌లో చూపించారు. బ్రిటిష్ పాలన, కరువు, ప్రజలపై అణచివేత, తిరుగుబాటు వంటి అంశాలతో ట్రైలర్ ఆసక్తిని పెంచింది. అయితే ఇదే సమయంలో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్‌లో ఎవరి గేమ్ బెస్ట్? సెలబ్రిటీలకు ఎదురుదెబ్బ తప్పదా?
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్‌లో ఎవరి గేమ్ బెస్ట్? సెలబ్రిటీలకు ఎదురుదెబ్బ తప్పదా?

'రణబాలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన రవిశంకర్.. విజయ్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయనకు మద్దతుగా నిలిచారు. విజయ్ ఎవరితోనూ వివాదాలకు వెళ్లే వ్యక్తి కాదని, తన పని, సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడతాడని చెప్పారు. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో కావాలనే నెగెటివ్ ప్రచారం జరగడం బాధ కలిగిస్తోందని అన్నారు. విజయ్‌తో తమ ప్రయాణం ఏడెనిమిదేళ్లుగా కొనసాగుతోందని చెప్పిన రవిశంకర్.. అతను చాలా సాఫ్ట్‌గా, మంచి మనసుతో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు.

Ranabaali Producer Ravi Shankar Reacts to Negativity Against Vijay Deverakonda

అయితే ఈ మధ్యకాలంలో విజయ్ ఏం చేసినా దానిని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయన.. సినిమా నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని స్పష్టం చేశారు. అయితే సినిమా, ట్రైలర్ చూడకముందే ఒక నిర్ణయానికి రావడాన్ని మాత్రం రవిశంకర్ ప్రశ్నించారు. 'రణబాలి' బ్రిటిష్ కాలం నాటి కథ కాబట్టి ఇప్పటి ప్రేక్షకులకు నచ్చదంటూ ముందుగానే ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

నా కాన్ఫిడెన్స్ వాడికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? ట్రోలర్స్‌కి విజయ్ దేవరకొండ కౌంటర్
నా కాన్ఫిడెన్స్ వాడికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? ట్రోలర్స్‌కి విజయ్ దేవరకొండ కౌంటర్

సినిమా విడుదలైన తర్వాత చూసి నచ్చలేదంటే ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పవచ్చని, కానీ సినిమా చూడకుండానే నెగెటివ్ ప్రచారం చేయడం మాత్రం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా 'రణబాలి' కోసం విజయ్ దేవరకొండ చేసిన కష్టాన్ని నిర్మాత ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పాత్ర కోసం విజయ్ దాదాపు 100 రోజుల పాటు గుర్రపు స్వారీపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని చెప్పారు. రాయలసీమ యాస, బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగ్గ శారీరక మార్పుల కోసం కూడా చాలా కష్టపడ్డారని తెలిపారు. ట్రైలర్‌లో విజయ్ కనిపిస్తున్న తీరు వెనుక ఈ శ్రమ ఉందని వివరించారు.

Ranabaali Official Trailer: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్ రిలీజ్..
Ranabaali Official Trailer: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్ రిలీజ్..

అదే సమయంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చేసిన పరిశోధన గురించి కూడా రవిశంకర్ ప్రస్తావించారు. 'రణబాలి' ప్రపంచాన్ని ప్రేక్షకులకు నమ్మకంగా చూపించేందుకు రాహుల్ సాంకృత్యన్ సుమారు రెండేళ్లపాటు కథ, కాలం, నేపథ్యంపై రీసెర్చ్ చేశారని చెప్పారు. కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా అప్పటి పరిస్థితులు, ప్రజల జీవనం, బ్రిటిష్ పాలనలోని అణచివేతను కథలో చూపించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ మాస్ అవతార్‌కు మంచి స్పందన వస్తోంది. రష్మిక మందన్నతో ఆయన కెమిస్ట్రీ, రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+