ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ.. ఎందులో చూడాలంటే..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందాన్న కాంబినేషన్ లో దసరా కానుకగా అక్టోబర్ 16 న 'రణబాలి' మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​ పై వై. రవిశంకర్, నవీన్ నిర్మించారు. టాక్సీవాలా మూవీ సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే రిలీజ్ అయ్యాక రణబాలి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. 1870 ల కాలంలో కరవు నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించింది. ఫుల్ రన్ లో ఈ మూవీ దాదాపు రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో రణబాలి మూవీతో ఆయన బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చినట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్- రష్మిక గతంలో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. అయితే పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ మూవీలో దర్శకుడు రాహుల్ ఎంచుకున్న సబ్జెక్ట్ తో పాటు స్క్రీన్ పై విజయ్- రష్మిక మధ్య కెమిస్ట్రీకూడా ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవలే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న రణబాలి మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Ranabaali Vijay Deverakonda and Rashmika latest blockbuster streaming on Netflix from November 13

ఈ మేరకు నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమంలో అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్‌ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించడంతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసే అవకాశం లభించింది. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజా వారు రాణి గారు చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవికిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి రాయలసీమ నేపథ్యంలో సాగే రూరల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+