Ranabaali: దసరా బరిలో విజయ్ - రష్మిక జంట - బిగ్ అప్‌డేట్..!!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పీరియాడిక్,దేశభక్తి చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు.అందులోనూ వాస్తవ చారిత్రక ఘట్టాల ఆధారంగా తెరకెక్కే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుంటాయి.ఇప్పుడు అదే తరహాలో సినీ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతూ,ది మోస్ట్ అవెయిటెడ్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది 'రణబాలి'.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్నారు.1854 నుండి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన నిజమైన చారిత్రక సంఘటనల ఆధారంగా 19వ శతాబ్దం నాటి నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ శక్తివంతమైన ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా,రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో అలరించనుంది. అంతేకాకుండా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo)'సిర్ థియోడార్ హెక్టర్'(డెమన్ ఆఫ్ డ్రాట్)అనే క్రూరమైన పాత్రతో భారతీయ చిత్రసీమలోకి అడుగుపెడుతుండటం విశేషం.దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ranabaali-vijay-deverakonda-and-rashmika-mandannas-period-action-film-sets-release-date

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని,వై.రవిశంకర్ నిర్మాతలుగా,టి-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం నిర్మాణ,నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాత్రల పరిచయాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

అల్లు అరవింద్, రష్మికకు యష్ స్ట్రాంగ్ కౌంటర్
అల్లు అరవింద్, రష్మికకు యష్ స్ట్రాంగ్ కౌంటర్

దేశభక్తి, యాక్షన్, బలమైన భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న 'రణబాలి',ఈ పండుగ సీజన్‌లో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.'రణబాలి' దసరా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+