టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై రేప్ కేసు నమోదు..
టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదయ్యింది. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధించారంటూ ఓ మహిళ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ నిమిత్తం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు వెళ్ళినప్పుడు తనపై పలు మార్లు అత్యాచారం చేసాడని ఆ మహిళ పేర్కొంది.

అంతేకాదు, హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం ఆ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) ఎన్ కింద కేసు నమోదు చేశారు.
ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు..
అయితే, జానీ మాస్టర్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కళాశాలలో మహిళపై దాడి చేసిన కేసులో జానీ మాస్టర్‌కు 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తాజాగా మరో మహిళ ఆయనపై కేసు నమోదు చేసింది. జానీ మాస్టర్ ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్‌కు ఎదిగారు. అయితే, ఇటీవలే ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా కూడా అవార్డ్ అందుకున్నారు. కెరీర్ మంచిగా సాగిపోతున్న తరుణంలో జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసారు. ఇదిలా ఉండగా, జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications